వారంలో 70వేల కేసులు, 2వేల మరణాలు!

తాజా వార్తలు

Updated : 10/06/2020 09:49 IST

వారంలో 70వేల కేసులు, 2వేల మరణాలు!

భారత్‌లో పెరుగుతున్న కరోనా తీవ్రత

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 9985 కేసులు నమోదయ్యాయి. దీంతో బుధవారం నాటికి దేశంలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 2,76,583కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఇదే సమయంలో కొవిడ్‌-19 మహమ్మారికి బలౌతున్న వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. తాజాగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 279మంది మృత్యువాతపడ్డారు. దేశంలో కరోనా సోకి ఇప్పటివరకు 7745మంది మృత్యువాతపడ్డట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 1,35,206 మంది కోలుకోగా మరో 1,33,632 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.

ఇదిలా ఉంటే, గడచిన వారంరోజులుగా దేశంలో నిత్యం 9వేలకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. ఇలా వారం రోజుల్లోనే దేశంలో 69,068 కేసులు, 1930 కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. జూన్‌ 3వ తేదీన దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2లక్షల 7వేలు దాటింది. అదే జూన్‌ 10నాటికి ఈ సంఖ్య 2లక్షల 76వేలకు చేరింది. అంతేకాకుండా కొవిడ్‌ సోకిన వారిలో ప్రతిరోజు 200లకు పైగా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా గడచిన వారంలో 1930 మంది ఈ మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. ఇప్పటికే ప్రపంచంలో కరోనా వైరస్‌ కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశాల్లో భారత్‌ ఐదో స్థానంలో ఉండగా.. మరణాల్లో మాత్రం 12వ స్థానంలో కొనసాగుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని