మాస్కుల్లేని వ్యక్తుల ముచ్చట్లు ప్రమాదకరం

తాజా వార్తలు

Updated : 10/06/2021 12:46 IST

మాస్కుల్లేని వ్యక్తుల ముచ్చట్లు ప్రమాదకరం

వాషింగ్టన్‌: నాలుగు గోడల మధ్య కూర్చుని ముచ్చట్లు చెప్పుకొనే వ్యక్తులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మాస్కులేని వ్యక్తి మాట్లాడుతున్న సమయంలో నోటి నుంచి, శ్వాసించే సమయంలో ముక్కు నుంచి వెలువడే నీటి ఆవిరితో కూడిన సూక్ష్మ తుంపరుల నుంచి కరోనా వైరస్‌ గాలిలోకి వ్యాపించే అవకాశం ఉందని తెలిపారు. అలా వచ్చిన వైరస్‌ అధిక సమయం పాటు గది వాతావరణంలో తేలియాడుతుందని, ఇతరులకు సులభంగా అది సంక్రమిస్తుందని తమ అధ్యయనంలో తేలిందని వెల్లడించారు. అమెరికాకు చెందిన జాతీయ మధుమేహం, జీర్ణాశయ, మూత్రపిండాల వ్యాధుల సంస్థ నిపుణులు నిర్వహించిన పరిశోధన వివరాలను ‘ఇంటర్నల్‌ మెడిసిన్‌’ అనే పత్రిక ప్రచురించింది. మాట్లాడుతున్నప్పుడు నోటి నుంచి వచ్చే తుంపర్లు... శ్వాస వదిలినప్పుడు వెలువడే గాలిలోని సూక్ష్మ బిందువుల కంటే పెద్ద పరిమాణంలో ఉంటాయి. అవి మోసుకొచ్చే వైరస్‌ల సంఖ్యా అధికమే. గదిలో వాయు ప్రసరణ తక్కువగా ఉంటే వైరస్‌ అధిక సమయం పాటు లోపలి భాగంలోనే తేలియాడుతుంది. దానివల్ల ఆ గదిలో ఉండే వ్యక్తులకు వైరస్‌ సంక్రమిస్తుందని తమ పరిశీలనలో తేలిందని అధ్యయన నివేదిక రచయిత, సీనియర్‌ శాస్త్రవేత్త ఆద్రియాన్‌ బాక్స్‌ తెలిపారు. గది లేదా హాలులో కూర్చుని ఆహారపదార్థాలు తినడం, పానీయాలు తాగడం, పెద్దగా మాట్లాడుకోవడం సహజంగానే జరుగుతుంటుంది. ఇవే పరిస్థితులు నెలకొని ఉండే రెస్టారెంట్లు, బార్లు వైరస్‌ వ్యాప్తికి ప్రధాన కేంద్రాలుగా ఉన్న విషయం తెలిసిందే. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని