close

తాజా వార్తలు

Published : 15/07/2020 18:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోష్యూర్‌: తక్కువ ఖర్చుతో కరోనా పరీక్షలు

అభివృద్ధి చేసిన దిల్లీ ఐఐటీ విద్యార్ధుల బృందం

దిల్లీ: తక్కువ ఖర్చుతో కరోనా పరీక్షను నిర్ధారించే కొత్త విధానాన్ని దిల్లీ ఐఐటీ విద్యార్ధుల బృందం అభివృద్ధి చేసింది. ‘కరోష్యూర్‌’గా పిలిచే ఈ కిట్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్ నిశాంక్‌, మానవ వనరుల శాఖ సహాయ మంత్రి సంజయ్‌ ధోత్రేతో కలిసి బుధవారం విడుదల చేశారు.  ఈ కిట్‌ అందుబాటులోకి రావడం చారిత్రాత్మక సందర్భమని అభివర్ణించిన మంత్రి, ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో ఆర్‌టీ-పీసీఆర్‌ (రియల్‌టైమ్‌-పీసీఆర్) ఆధారిత కరోనా పరీక్షల కిట్‌ను రూపొందించిన తొలి విద్యాసంస్థగా ఐఐటీ దిల్లీ నిలిచిపోతుందని ప్రశంసించారు.

నాన్‌-ఎక్స్‌క్లూజివ్‌ ఓపెన్‌ లెసెన్స్ ద్వారా కరోష్యూర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కంపెనీలకు వాణిజ్య అనుమతులు మంజూరు చేసినట్లు ఐఐటీ దిల్లీ తెలిపింది. న్యూటెక్‌ మెడికల్ డివైజెస్‌ అనే సంస్థ ఈ కిట్‌ను రూ.650కి మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటిచింది. ప్రస్తుతం మార్కెట్ల్లో కరోనా పరీక్షలకు ఉపయోగించే వాటితో పోల్చితే ఇదే అతి తక్కువ ధర అని సంస్థ తెలిపింది.

‘‘ఈ కిట్ అందుబాటులోకి రావడంతో దేశంలో కరోనా పరీక్షల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్‌ఆర్), డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) ఈ కిట్‌తో పరీక్షలు నిర్వహించేందుకు అనుమతులు మంజూరు చేశాయి. న్యూటెక్‌ మెడికల్ డివైజెస్‌, ఐఐటీ దిల్లీ టెక్నాలజీతో అతి తక్కువ ఖర్చుతో నెలకు 20 లక్షల పరీక్షలు చేస్తుంది. ల్యాబ్‌ నుంచి మార్కెట్‌కు ఇది నిజమైన ఉదాహరణ’’ అని ఐఐటీ దిల్లీ డైరెక్టర్‌ వి.రాంగోపాల్ రావు తెలిపారు.

ప్రస్తుతం మార్కెట్లో ప్రోబ్‌-బేస్డ్‌ పరీక్షా విధానం అందుబాటులో ఉందని, కానీ తాము రూపొందించిన కిట్‌తో ప్రోబ్‌-ఫ్రీ విధానం ద్వారా పరీక్షలు చేయవచ్చని, దీని వల్ల పరీక్షలు చేసేందుకు అయ్యే ఖర్చు తగ్గుతుందని, అలానే ఫలితాల్లో ఖచ్చితత్వంలో ఎలాంటి రాజీ ఉండదని ఐఐటీ దిల్లీ తెలిపింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని