లక్ష కేసులకు చేరువలో మహారాష్ట్ర!
close

తాజా వార్తలు

Updated : 12/06/2020 12:21 IST

లక్ష కేసులకు చేరువలో మహారాష్ట్ర!

నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 3607 కేసులు

ముంబయి: కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి మహారాష్ట్ర ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దేశంలోనే అత్యధికంగా కరోనా వైరస్‌ తీవత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. గతకొన్ని రోజులుగా ఇక్కడ ప్రతిరోజు దాదాపు 2500లకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా 3607 కేసులు నమోదవడంతో పాటు, 152 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 97,648కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 3590 మంది మృత్యువాతపడ్డారు. గడచిన 24గంటల్లో దేశంలో దాదాపు 11వేల కేసులు నమోదుకాగా వీటిలో మహారాష్ట్రలోనే 35శాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గడచిన వారంలోనే రాష్ట్రంలో 22వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా కలవరపెడుతోంది.

ముంబయి విలవిల..
కరోనా విజృంభణతో ముంబయి మహానగరం విలవిల్లాడుతోంది. ఇప్పటివరకు నగరంలో 54,000 కరోనా కేసులు నమోదుకావడంతోపాటు 1954మరణాలు సంభవించాయి. నగరంలో నిత్యం 1500కిపైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. ఇక నగరంలో విధులు నిర్వర్తిస్తోన్న పోలీసులు కూడా భారీ స్థాయిలో వైరస్‌ బారినపడటం ఆందోళనకు గురిచేస్తోంది. కేవలం ముంబయి నగరంలోనే ఇప్పటివరకు 2028మంది పోలీసు సిబ్బంది కొవిడ్‌ బారినపడ్డారు. రాష్ట్రంలో దాదాపు 2600మంది పోలీసు సిబ్బంది ఈ వైరస్‌ బారినపడినట్లు పోలీసుశాఖ వెల్లడించింది. వీరిలో 34మంది ప్రాణాలు కోల్పోయారు.

12రాష్ట్రాల్లోనే అత్యధికం..
భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం సృష్టిస్తోంది. దేశంలో కరోనా కేసులు అత్యధికంగా 12రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. ఈ 12రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఐదువేలకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఏడు రాష్ట్రాల్లో మాత్రం కేసుల సంఖ్య పదివేలు దాటింది. వాటి వివరాలు ఇలా..

రాష్ట్రం  కేసులు  మరణాలు
మహారాష్ట్ర 97,648 3590
తమిళనాడు  38,716 349
దిల్లీ   34,687 1085
గుజరాత్‌   22032  1385
ఉత్తర్‌ప్రదేశ్‌   12088 345
రాజస్థాన్ 11838  265
మధ్యప్రదేశ్‌ 10241  431
పశ్చిమబెంగాల్‌ 9768  442
కర్ణాటక 6245 72
బిహార్‌  5983  36
హరియాణా 5968 64
ఆంధ్రప్రదేశ్‌ 5429  80

ఇవీ చదవండి..
ప్రపంచంలో 4వ స్థానానికి భారత్‌
ముప్పు భారీగానే ఉంది: ఐసీఎంఆర్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని