
తాజా వార్తలు
కొవిడ్ పాజిటివిటీ రేటు క్షీణించింది: జైన్
దిల్లీ: నవంబర్ ప్రారంభం నుంచి దేశ రాజధానిలో కొవిడ్ పాజిటివిటీ రేటు 55 శాతం క్షీణించిందని దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ వెల్లడించారు. రాబోయే రెండు వారాల్లో దీన్ని మరింత తగ్గించాల్సి ఉందని మీడియాతో వెల్లడించారు.
‘సోమవారం కొవిడ్ పాజిటివ్ రేటు 7.35శాతంగా ఉంది. నవంబర్ 7న ఆ రేటు 15.26 శాతంగా ఉంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 55 శాతం క్షీణత ఉంది. రాబోయే ఒకటి రెండు వారాల్లో ఇది మరింత క్షీణిస్తుందని, త్వరలోనే నియంత్రణలోకి వస్తుంది’ అని జైన్ వెల్లడించారు. కాగా, సోమవారం దిల్లీలో కరోనా కేసులు 3,726గా ఉండగా..మరణాల సంఖ్య మరోసారి 100 మార్కును దాటింది. గత 24 గంటల్లో 108 మంది ప్రాణాలు కోల్పోయారు.
Tags :
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు