close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120044360 [video_srlno] => 1 [video_type] => 3 [video_link] => 1245367203693723650 [video_short_link] => 1245367203693723650 [created_by] => [created_date] => [modified_by] => 9823211 [modified_date] => 2020-04-02 12:19:57.897748 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 02/04/2020 14:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

ఆరోగ్యం, రోగ నిరోధక శక్తికి ఇవి వాడండి: మోదీ

ట్విటర్‌లో పిలుపునిచ్చిన ప్రధాని

న్యూదిల్లీ: కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి వేల మంది ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. కొవిడ్-‌19పై పోరాడేందుకు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుచుకోవటం ముఖ్యమని ఆయుష్‌ మంత్రిత్వశాఖ సూచించింది. ఇందుకు కాచిన నీటిని తాగాలని, ప్రాణాయామం, 30 నిమిషాలపాటు ధ్యానం చేయాలని ఆ శాఖ ప్రకటించింది. అంతేకాకుండా, ఆహారంలో జీలకర్ర, కొత్తిమీర, వెల్లుల్లి ఉపయోగించాలని కూడా ఆయుష్‌ మంత్రిత్వ శాఖ సూచించింది. శరీరంలో ఆరోగ్యం మెరుగుపడడానికి, రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఈ పదార్థాలు ముఖ్యపాత్ర పోషిస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, ఆయుష్‌ మంత్రిత్వశాఖ సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ కోరారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో కొవిడ్-‌19కు మందు లేదు. నివారణ కంటే నిరోధకత మంచిదని మనందరికీ తెలుసు.  కాబట్టి ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఇచ్చిన ప్రోటోకాల్స్‌ను పాటించండి’ అనిమోదీ ట్విట్‌ చేశారు. 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.