చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత..మెట్రో రైళ్లు బంద్‌!

తాజా వార్తలు

Updated : 25/11/2020 19:09 IST

చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత..మెట్రో రైళ్లు బంద్‌!

చెన్నై: నివర్‌ తుపాను ప్రభావంతో చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ రోజు రాత్రి 7గంటల నుంచి రేపు ఉదయం 7గంటల వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించారు. తుపాను తీవ్రత దృష్ట్యా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

అలాగే, ఈ రోజు రాత్రి 7గంటల తర్వాత మెట్రో రైళ్ల సేవలను కూడా నిలిపివేస్తున్నట్టు చెన్నై మెట్రో అధికారులు తెలిపారు. గురువారం ఉండే వాతావరణాన్ని బట్టి మెట్రో రైలు సర్వీసులు రైళ్ల సర్వీసుల పునరుద్ధరణ ఉంటుందని పేర్కొన్నారు.

చెన్నైలో ప్రధాన రహదారుల మూసివేత
తుపాను ప్రభావంతో భారీ వర్షాల దృష్ట్యా చెన్నై నగరంలోని ప్రధాన రహదారులను అధికారులు మూసివేశారు. మళ్లీ ప్రకటించేవరకు రహదారుల మూసివేత కొనసాగుతుందని చెన్నై ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. 

పలు రైళ్లు రద్దు
మరోవైపు, ఈరోజు, రేపు నడవనున్న పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. రేపటి చెన్నై సెంట్రల్‌ - తిరుపతి రైలుతో పాటు తిరుపతి - చెన్నై సెంట్రల్‌; హైదరాబాద్‌ -తంబరం; తంబరం- హైదరాబాద్‌; మదురై - బికనీర్‌; బికనీర్‌ మదురై; చెన్నై సెంట్రల్‌ - సంత్రగచ్చి రైళ్లను రద్దుచేసింది. అలాగే, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నడిచే ఎనిమిది రైళ్లను దారి మళ్లించడంతో పాటు మరో రైలు సర్వీసును రద్దుచేసినట్టు అధికారులు ప్రకటించారు.

ఇదీ చదవండి..

లైవ్‌: నివర్‌ గమనం ఇలా..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని