close

తాజా వార్తలు

సీఏఏ, ఎన్‌ఆర్‌సీపై సంతకాల ఉద్యమం

తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్‌, డీఎండీకే నిర్ణయం  

చెన్నై: ఎన్‌ఆర్‌సీ, పార్లమెంట్‌ ఆమోదించిన పౌరసత్వ చట్టసవరణ చట్టాని(సీఏఏ)కి వ్యతిరేకంగా డీఎంకే, దాని మిత్రపక్షాలు ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. డీఎంకే నేతృత్వంలో ఫిబ్రవరిలో భారీస్థాయిలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ అధినేత స్టాలిన్‌ వెల్లడించారు. శుక్రవారం చెన్నైలో డీఎంకే, కాంగ్రెస్‌, డీఎండీకే నేతలు సమావేశమై దీనిపై చర్చించారు. సీఏఏను ఉపసంహరించుకోవడంతో పాటు ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ ప్రక్రియలను తమిళనాడులో నిర్వహించకూడదన్నారు. దీనికి సంబంధించి ఓ తీర్మానాన్ని కూడా రూపొందించారు. ఫిబ్రవరి 2 నుంచి  8 వరకు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నట్టు స్టాలిన్‌ తెలిపారు. అనంతరం ఈ సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు అందజేయనున్నట్టు తెలిపారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.