close

తాజా వార్తలు

Updated : 24/11/2020 10:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దేశంలో మళ్లీ 40వేల దిగువకు కొత్త కేసులు

దిల్లీ: భారత్‌లో గత కొన్ని రోజులు నుంచి కలవరపెడుతున్న కరోనా కేసులు సోమవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. అంతకుముందు వరుసగా రెండు రోజులు కోలుకున్న వారి కంటే కొత్త వైరస్‌ కేసులే ఎక్కువగా ఉండగా.. తాజాగా రికవరీల సంఖ్యే ఎక్కువగా ఉండటం ఊరటనిస్తోంది. ఇక కొత్త కేసులు కూడా మళ్లీ 40వేల దిగువన నమోదయ్యాయి. 

గడిచిన 24 గంటల్లో 10,99,545  పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 37,975 వైరస్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 91,77,840కు చేరింది. ఇక సోమవారం మరో 42,314 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 86,04,955 మంది వైరస్‌ నుంచి సురక్షితంగా బయటపడగా.. రికవరీ రేటు 93.76శాతానికి పెరిగింది. ప్రస్తుతం 4,38,667 యాక్టివ్‌ కేసులుండగా.. క్రియాశీల రేటు 4.78శాతానికి పడిపోయింది. గడిచిన 24 గంటల్లో మరో 480 మంది కొవిడ్‌కు బలయ్యారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,34,218కి పెరిగింది. భారత్‌లో మరణాల రేటు 1.46శాతంగా ఉంది. 

దేశంలో కొవిడ్‌ పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించనున్నారు. కరోనా కేసులు అధికంగా ఉన్న 8 రాష్ట్రాల సీఎంలతో ఉదయం 10 గంటలకు మాట్లాడనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు వ్యాక్సినేషన్‌ భవిష్యత్‌ కార్యాచరణపై అన్ని రాష్ట్రాల సీఎంతో చర్చించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన