close

తాజా వార్తలు

41కి చేరిన కరోనా మృతుల సంఖ్య

వుహాన్‌: చైనాలో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. ఈ వైరస్ ధాటికి చనిపోయిన వారి సంఖ్య 41కి చేరింది. శుక్రవారం ఒక్కరోజే 15 మంది చనిపోవడం వ్యాధి తీవ్రతను తెలియజేస్తోంది. వీరంతా వుహాన్‌ నగరానికే చెందిన వారు కావడం గమనార్హం. మరో వెయ్యి మందికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. వీరిలో దాదాపు 237 మంది పరిస్థితి ఆందోళకరంగా ఉంది. ఈ మేరకు చైనా అధికారులు శనివారం అధికారిక ప్రకటన చేశారు. వైరస్‌ వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతుండడంతో చైనాలో 13 నగరాల్లో కఠిన ఆంక్షలు విధించారు. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వుహాన్‌ నగరమైతే పూర్తిగా అష్టదిగ్బంధంలో ఉండిపోయింది. వారికి ఆహార పదార్థాల్ని ఎప్పకటికప్పుడూ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. 

పరిశీలనలో హైదరాబాద్‌వాసి...

మరోవైపు ఈ వైరస్ ఇతర దేశాలకూ వ్యాపిస్తోంది. ఇప్పటికే అమెరికాలో రెండు కేసులు వెలుగుచూశాయి. తాజాగా ఫ్రాన్స్‌లో ముగ్గురు ఈ వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడ్డట్లు గుర్తించారు. థాయ్‌లాండ్‌, జపాన్‌, సౌత్‌ కొరియా, తైవాన్, సింగపూర్‌, వియత్నాంలోనూ వైరస్ మూలాలు కనుగొన్న విషయం తెలిసిందే. ఇటు భారత్‌లోనూ అధికారులు అప్రమత్తం అయ్యారు. విమానాశ్రయాల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత రాత్రి నుంచి చైనాలోని వివిధ నగరాల నుంచి భారత్‌కు వచ్చిన దాదాపు 1000 మందికి పూర్తి స్థాయి తనిఖీలు నిర్వహించారు. వీరిలో ఎవరికీ వైరస్ సోకలేదని ధ్రువీకరించారు. కానీ, 11 మందికి స్వల్ప స్థాయిలో ఫ్లూ లక్షణాలు కనిపించడంతో వారిని వైద్యుల పరిశీలనలో ఉంచారు. వీరిలో ఏడుగురు కేరళ, ఇద్దరు ముంబయికి చెందిన వారు కాగా.. మరో ఇద్దరు బెంగళూరు, హైదరాబాద్‌ నివాసులుగా గుర్తించారు. వారిలో నలుగురికి ఎలాంటి ప్రమాదం లేదని ధ్రువీకరించి శుక్రవారం రాత్రి విడుదల చేశారు. కేరళలో మరో 73 మందిని వారి ఇళ్లలోనే ఉంచి వైద్యపరమైన నిఘా విధించారు. దేశంలో ఇంతవరకు ఎవరిలోనూ వైరస్‌ బయటపడలేదని అధికారులు స్పష్టం చేశారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.