దిల్లీకి విమానాలు, రైళ్లపై 8 రోజుల్ల్లో నిర్ణయం!

తాజా వార్తలు

Published : 23/11/2020 16:44 IST

దిల్లీకి విమానాలు, రైళ్లపై 8 రోజుల్ల్లో నిర్ణయం!

ముంబయి: దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో దిల్లీ నుంచి ముంబయికి ప్రజల రాకపోకల అంశంపై ఎనిమిది రోజుల్లో  నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర మంత్రి తెలిపారు. గత నెల రోజులుగా దిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి విమానాలు, రైళ్లు, రహదారి ప్రయాణాలకు సంబంధించి ఎనిమిది రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని మంత్రి విజయ్‌ వడ్డేటివార్‌ తెలిపారు. దిల్లీతో పాటు గుజరాత్‌లో పరిస్థితిపైనా దృష్టి సారించినట్టు చెప్పారు. ఒకవేళ గుజరాత్‌లో లాక్‌డౌన్‌ ప్రకటిస్తే.. రాకపోకలకు అవకాశం ఉండదన్నారు. 

మరోవైపు, అక్టోబర్ 28 నుంచి దిల్లీలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదువుతుండటంతో కలవరం మొదలైంది. ఓ దశలో కొత్త కేసుల సఖ్య 8వేల మార్కును దాటడం అక్కడి ప్రజల్లో గుబులు రోపుతోంది. ఆదివారం ఒక్కరోజే దిల్లీలో 6746 కొత్త కేసులు నమోదైన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని