close

తాజా వార్తలు

Updated : 29/11/2020 22:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దిల్లీలో తగ్గుతున్న కరోనా కేసులు..

దిల్లీ: దేశ రాజధానిలో వరుసగా రెండో రోజు 5 వేల కన్నా తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి.  ఈ క్రమంలో  నవంబర్‌ 7 తర్వాత గణాంకాలు పరిశీలిస్తే మరణాల సంఖ్య కూడా తగ్గిందని అధికారులు ఆదివారం తెలిపారు.  దిల్లీలో శనివారం 4,998 కరోనా కేసులు నమోదవ్వగా,  ఆదివారం 4,906 కరోనా పాజిటివ్‌లు వచ్చాయి.  దీంతో వరుసగా రెండు రోజుల పాటు కొవిడ్‌ కేసులు తగ్గడం కొంచెం ఊరటనిచ్చే విషయమని చెప్పాలి.  ప్రభుత్వం తీసుకున్న చర్యల దృష్ట్యా దేశ రాజధానిలో కొవిడ్‌-19 కేసులు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు దిల్లీ ప్రభుత్వం కరోనా వివరాలు వెల్లడించింది.  రెండు రోజుల ముందు 5 వేలకు పైగా పాజిటివ్‌  కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో  64,186 కరోనా పరీక్షలు నిర్వహించారు.  ఒక రోజులో  6,325 మంది డిశ్చార్జి అయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు దిల్లీలో 5,66,648 కరోనా కేసులు రాగా, 35,091 క్రియాశీల కేసులు ఉన్నాయి. మొత్తంగా 9,066 మంది మరణించారు. కరోనా కేసులు పెరిగిన తరుణంలో ఈ నెల మొదట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సమావేశమయ్యారు.  దిల్లీకి  వందల సంఖ్యలో  ఇంటెన్సివ్‌ కేర్‌ పడకలు అందిస్తామని సమావేశం అనంతరం షా చెప్పారు. ప్రస్తుతం దేశ రాజధానిలో కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన పడకలలో 50 శాతం వరకు ఖాళీగా ఉన్నాయని శనివారం దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ తెలిపారు.
 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన