సరిహద్దులో సైన్యం అప్రమత్తత భేష్‌: రాజ్‌నాథ్‌

తాజా వార్తలు

Published : 28/10/2020 23:38 IST

సరిహద్దులో సైన్యం అప్రమత్తత భేష్‌: రాజ్‌నాథ్‌

దిల్లీ: సరిహద్దుల్లో భారత సైన్యం అప్రమత్తతను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రశంసించారు. దిల్లీలో బుధవారం నిర్వహించిన ఉన్నత స్థాయి కమాండర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన విషయాల్ని రాజ్‌నాథ్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘దేశ భద్రతా దళాలను, ఆయుధాలను బలోపేతం చేసేందుకు భారత ప్రభుత్వం ఏ అవకాశాన్ని వదులుకోదు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత ఆర్మీ చేపడుతున్న భద్రతా కార్యక్రమాలపై నేను గర్విస్తున్నా. సైన్యాన్ని అన్నివిధాలుగా ప్రోత్సహించడానికి కేంద్ర రక్షణ శాఖ కట్టుబడి ఉంది. సైన్యం లక్ష్యాలకు అనుగుణంగా సంస్కరణలు, సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశ భద్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన అనేక సవాళ్లను పరిష్కరించడంలో భారత సైన్యం విజయవంతమైంది. ఉగ్రవాదం, తిరుగుబాట్లు, ఏ ఇతర దాడుల సమస్యలనైనా తిప్పికొట్టడంలో సైన్యం కీలక పాత్ర పోషించింది’ అని రాజ్‌నాథ్‌ ట్వీట్‌లో తెలిపారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని