దిల్లీ దేశానికి ‘కరోనా రాజధాని’గా మారేలా ఉంది!

తాజా వార్తలు

Published : 05/11/2020 18:10 IST

దిల్లీ దేశానికి ‘కరోనా రాజధాని’గా మారేలా ఉంది!

దిల్లీ: దేశ రాజధానిలో కరోనా వైరస్‌ కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటంపై దిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. చూస్తుంటే రాబోయే రోజుల్లో దిల్లీ నగరం ‘దేశానికి కరోనా రాజధాని’గా మారేటట్లు ఉందని వ్యాఖ్యానించింది. జస్టిస్‌ హిమా కోహ్లీ, సుబ్రహ్మణ్యం ప్రసాద్‌ల ధర్మాసనం వైద్య, పారిశుద్ధ్య ఇతర సిబ్బంది వేతన చెల్లింపులకు సంబంధించిన పిటిషన్ల విచారణ సమయంలో ఈ వ్యాఖ్యలు చేసింది. ‘దిల్లీ త్వరలో దేశానికి కరోనా రాజధాని అయ్యేలా ఉంది. ఆప్‌ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలి. ఈ విషయాన్ని తాము సీరియస్‌గా పరిగణనలోకి తీసుకుంటున్నాం’ అని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది. ఆప్‌ ప్రభుత్వం మహమ్మారిని తేలికగా తీసుకుందని.. పౌరుల ఆరోగ్య సంరక్షణను ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొంది.  ప్రభుత్వం పరీక్షలు చేయడంలో అగ్రస్థానంలోనే ఉన్నట్లు చెబుతున్నప్పటికీ.. మరోవైపు కేసుల సంఖ్య మాత్రం పెరుగుతుండటాన్ని గమనించినట్లు కోర్టు వెల్లడించింది. 

కాగా దేశరాజధాని దిల్లీలో గత రెండు రోజులుగా కరోనా వైరస్‌ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న విషయం తెలిసిందే. గత రెండు రోజుల నుంచి 6వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 6,842 కేసులు నమోదు కాగా.. 51 మంది మరణించారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 37వేలు ఉన్నాయి. కాగా ఓ వైపు శీతాకాలం కూడా రావడంతో కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఇదివరకే కాలుష్యం తగ్గించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది దీపావళికి టపాకాయలు కాల్చడాన్ని మానుకోవాలని సీఎం కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని