close

తాజా వార్తలు

Published : 30/11/2020 18:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దిల్లీలో ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్‌ ధరలు భారీగా తగ్గింపు

దిల్లీ: దేశ రాజధాని నగరంలో కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ కొవిడ్‌ టెస్ట్‌లపై కేజ్రీవాల్‌ సర్కార్‌ కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రైవేటు ల్యాబ్‌లలో నిర్వహించే ఆర్‌టీ- పీసీఆర్‌ టెస్ట్‌ల ధరలను భారీగా తగ్గించింది. ఈ మేరకు నగరంలోని అన్ని ప్రైవేటు లేబొరేటరీలకు సోమవారం ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ.. ప్రైవేటు ల్యాబ్‌లలో మాత్రం ఒక్కో టెస్ట్‌కు రూ.2,400 చొప్పున వసూలు చేస్తున్నారు. అయితే, దీన్ని రూ.800లకు తగ్గిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు దిల్లీ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఒకవేళ ఇంటికి వచ్చి శాంపిల్స్‌ సేకరిస్తే అందుకు రూ.1,200లుగా ధరను నిర్ణయించింది. 24గంటల్లో అన్ని లేబొరేటరీలు, ఆస్పత్రుల్లో సవరించిన ధరలను బోర్డుల్లో ప్రదర్శించాలని ఆదేశించింది. ప్రైవేటు లేబొరేటరీలు సేకరించిన శాంపిల్స్‌, రిపోర్టులకు సంబంధించిన వివరాలను ఐసీఎంఆర్‌ పోర్టల్‌లో అప్‌డేట్‌ చేయాలని సూచించింది.

దేశ రాజధానిలో కొవిడ్‌ విజృంభిస్తున్న వేళ ఇటీవల దిల్లీ హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టు కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే.  దిల్లీలో థర్డ్‌ వేవ్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై కోర్టులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, సీఎం కేజ్రీవాల్‌ ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల ధరల తగ్గిస్తామని ప్రకటన చేశారు. వైరస్‌ దాడి నేపథ్యంలో ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య పెరిగింది. దీంతో ప్రజలపై భారం పడకూడదనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కేజ్రీవాల్‌ ట్విటర్‌లో తెలిపారు. కేజ్రీవాల్‌ ట్వీట్‌పై స్పందించిన దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర కుమార్‌ జైన్‌ దీనిపై తక్షణమే ఆదేశాలు జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్న గంటల వ్యవధిలోనే ఆర్టీ-పీసీఆర్‌ టెస్ట్‌ల ధరలను రూ.800లకు తగ్గిస్తూ ప్రకటన చేయడం విశేషం.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని