close

తాజా వార్తలు

Published : 31/10/2020 14:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘దిల్లీలో కరోనా విజృంభణకు కారణాలివే’

వెల్లడించిన ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌

దిల్లీ: దిల్లీలో నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం ఎన్నడూలేని విధంగా 5,891 కేసులు.. 47 మరణాలు నమోదయ్యాయి. దేశంలో అత్యధిక కేసులు నమోదైన మహానగరం ఇదే. ఈ నేపథ్యంలో మహమ్మారి మళ్లీ విజృంభించడానికి గల కారణాలను అక్కడి ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ వివరించారు. మానవ తప్పిదాలు కూడా కరోనా వ్యాప్తికి కారణమవుతున్నాయని తెలిపారు. 

ప్రస్తుతం నడుస్తున్న పండగ సీజన్‌, శీతాకాలం, వాయుకాలుష్య పెరుగుదల వంటి కారణాల వల్లే కరోనా కేసుల సంఖ్య మరోసారి పెరుగుతోందని సత్యేంద్ర జైన్‌ తెలిపారు. ఈ సమయంలో మహమ్మారి విజృంభించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సైతం తెలిపారన్నారు. గత పదిరోజులుగా దిల్లీలో వాయుకాలుష్యం  ప్రమాదకర స్థాయిలో ఉంటున్న విషయం తెలిసిందే. ప్రజల నిర్లక్ష్యం కూడా వైరస్‌ వ్యాప్తికి కారణమవుతోందన్నారు. మాస్కులు ధరించడానికి ప్రజలు అసలు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నారు. లాక్‌డౌన్‌ విధించడం కంటే మాస్క్‌ ధరించడం వల్లే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. వ్యాక్సిన్‌ వచ్చే వరకు మాస్క్‌నే టీకాగా భావించాలని విజ్ఞప్తి చేశారు. 

దిల్లీలో కరోనా కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం దృష్టి సారించింది. ఇప్పటి వరకు రెండుసార్లు దిల్లీ ప్రభుత్వ యంత్రాంగంతో సమాలోచనలు చేసింది. జులైలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో భేటీ కాగా.. తాజాగా సోమవారం కేంద్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి అజయ్‌ భల్లా దిల్లీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వైరస్‌ కట్టడికి అవలంబించాల్సిన విధానాలపై చర్చించారు.

ఇవీ చదవండి..

విమాన ప్రయాణం కంటే బయట తినడమే డేంజర్‌!

దేశంలో 91శాతానికి పెరిగిన రికవరీలు


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.