కరోనా నుంచి కోలుకున్న వారెందరంటే!
close

తాజా వార్తలు

Published : 03/07/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా నుంచి కోలుకున్న వారెందరంటే!

న్యూదిల్లీ: కరోనా బారిన పడుతున్న వారితో పోలిస్తే, కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్న వారితో పోలిస్తే, కోలుకుంటున్న వారు 1.32లక్షల మంది ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.

‘రోజూ సగటున 10వేలమందికి పైగా కరోనా నుంచి కోలుకుంటున్నారు. గత 24గంటల్లో 11,881మంది ఈ మహమ్మారి నుంచి బయటపడ్డారు. మొత్తంగా 3,59,859మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం రికవరీ రేటు 59.52గా ఉంది’ అని ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుతం 2,26,947మంది ఇంకా చికిత్స తీసుకుంటున్నారు. గురువారం నాటికి దేశంలో కరోనా బారినపడ్డ వారి సంఖ్య 6,04,641కి చేరింది. ఒక్కరోజులోనే 19,148మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇప్పటివరకూ 17,834మంది మృత్యువాతపడ్డారు.

దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదైన సంగతి తెలిసిందే. కాగా, ఆ రాష్ట్రంలో 93,154మంది కరోనా నుంచి కోలుకున్నారు ఆ తర్వాతి స్థానాల్లో దిల్లీ(59,992), తమిళనాడు (52,926), గుజరాత్‌ (24,030), ఉత్తర్‌ప్రదేశ్‌ (16,629), రాజస్థాన్‌ (14,574), పశ్చిమ బెంగాల్‌ (12,528), మధ్యప్రదేశ్‌ (10,655), హరియాణా(10,499), తెలంగాణ (8,082), కర్ణాటక (8,063),  బిహార్‌ (7,946), ఆంధ్రప్రదేశ్‌ (6,988), అస్సాం (5,8151), ఒడిశా (5,353)రాష్ట్రాలు ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని