జమిలి ఎన్నికలపై పెరుగుతున్న ఊహాగానాలు

తాజా వార్తలు

Published : 23/12/2020 00:09 IST

జమిలి ఎన్నికలపై పెరుగుతున్న ఊహాగానాలు

ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ప్రచారం

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో జమిలి ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అభివృద్ధికి ఎన్నికల కోడ్‌ అడ్డం కారాదని ప్రధాని మోదీ ఆలోచననుంచి పుట్టుకొచ్చిన జమిలి ప్రతిపాదనపై పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల కొన్ని ప్రధాన రాజకీయ పక్షాల అధినేతలు ఒకే దేశం.. ఒకే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని శ్రేణులకు పిలుపునివ్వడం కొత్త చర్చకు తెరలేపింది. చట్టాల్లో తగిన సవరణలు చేస్తే జమిలికి తాము సిద్ధమేనని సాక్షాత్తు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ చెప్పడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. 

దేశవ్యాప్తంగా లోక్‌సభ సహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోదీ ఎప్పటినుంచో కోరుతున్నారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు చర్చించాలని ఇప్పటికే అనేక వేదికలపైనుంచి మోదీ పిలుపునిచ్చారు. దేశంలో ఎప్పుడూ ఏదో ఒకచోట ఎన్నికలు జరగడం వల్ల ఆ సమయంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లో జాప్యం చోటుచేసుకుంటోందని మోదీ పేర్కొంటున్నారు. అయితే ప్రధాని పేర్కొన్న మాటలతో కొన్ని పార్టీలు ఏకీభవిస్తున్నప్పటికీ.. ఏవైనా కారణాలతో మధ్యలోనే ప్రభుత్వం కూలిపోతే అప్పుడు మధ్యంతర ఎన్నికలు తప్పవుకదా అని పలు సందేహాలు లేవనెత్తాయి. 

2022లో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోందనే ప్రచారం ఇటీవల ఊపందుకుంది. ఈ ప్రచారానికి బలమిస్తూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ జమిలి ఎన్నికలు వస్తే సిద్ధంగా ఉండాలని తమ పార్టీల అంతర్గత సమావేశాల్లో ఇటీవల పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చట్టాలు చేస్తే ఎన్నికలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోడా చెప్పడం పలు ఊహాగానాలకు తెరలేపింది. జమిలి ఎన్నికలు ఖాయమనే వాదనకు మద్దతు పెరుగుతోంది. మోదీ ప్రభుత్వం ఈమేరకు సన్నాహాలు చేస్తోందనే ప్రచారం మరింత ఊపందుకుంది.

ఇవీ చదవండి...

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు సాధ్యమేనా?

వణికించే చలిలో ఒకటే లక్ష్యంతో..Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని