లద్ధాఖ్‌పై చైనా మళ్లీ పాత పాటే..
close

తాజా వార్తలు

Published : 13/10/2020 17:25 IST

లద్ధాఖ్‌పై చైనా మళ్లీ పాత పాటే..

బీజింగ్‌: లద్దాఖ్‌ విషయంలో దుందుడుకుగా వ్యవహరిస్తూ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం సృష్టిస్తోన్న పొరుగు దేశం చైనా మరోసారి తన అక్కసు వెళ్లగక్కింది. లద్దాఖ్‌ను తాము గుర్తించలేదని పాడిన పాటే పాడుతోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు భారతే కారణమంటూ అర్థం లేని వాదనలు చేస్తోంది. లద్దాఖ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా నిర్మించిన 44 వంతెనలను భారత్‌ సోమవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నిర్మాణాలను వ్యతిరేకించిన చైనా మళ్లీ భారత్‌పై నోరుపారేసుకుంది. 

ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్‌ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ అరుణాచల్‌ప్రదేశ్‌, లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాన్ని చైనా గుర్తించలేదు. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల్లో సైనిక నిఘా నిమిత్తం భారత్‌ చేపట్టిన మౌలిక సదుపాయాల నిర్మాణాలను(వంతెనల ఏర్పాటును ఉద్దేశిస్తూ) మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. భారత, చైనా ఇటీవల చేసుకున్న ఒప్పందం ప్రకారం.. సరిహద్దు ప్రాంతాల్లో వివాదాలకు తావిచ్చే ఎలాంటి చర్యలను ఉభయ దేశాలు చేపట్టరాదు’ అని అన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని