close
Array ( ) 1

తాజా వార్తలు

ట్రంప్‌ కోసం 70లక్షల మంది..సాధ్యమేనా..? 

అంతమంది ఎక్కడనుంచి వస్తారంటున్న నెటిజన్లు?

అహ్మదాబాద్‌: భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల చేసిన ప్రకటనపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ట్రంప్‌ ఈనెల 24న భారత్‌కు చేరుకోనున్నారు. ట్రంప్‌కు ఘన స్వాగతం పలకడానికి అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి ‘నమస్తే ప్రెసిడెంట్‌ ట్రంప్‌’ కార్యక్రమం జరిగే మోతేరా స్టేడియం వరకు రోడ్‌ షో ఏర్పాటు చేశారు. రహదారి పక్కన భారీ సంఖ్యలో ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఎయిర్‌పోర్టుకు.. మోతేరా స్టేడియంకు మధ్య 70లక్షల మంది ఉంటారని మోదీ చెప్పారని ట్రంప్‌ తాజాగా వాషింగ్టన్‌లో విలేకరులకు వెల్లడించారు. అయితే దీనిపై నెటిజన్లు మాత్రం విరుచుకుపడుతున్నారు.

రోడ్‌షోలో పాల్గొనే ప్రజల సంఖ్యపై సందేహాలు వ్యక్తం చేస్తూ ట్విటర్‌లో కామెంట్లు పెడుతున్నారు. ‘అహ్మదాబాద్‌ జనాభానే కేవలం దాదాపు 50-55లక్షలుంటే 70లక్షల మంది ఎక్కడినుంచి వస్తారు?’ అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయపార్టీల బహిరంగ సభలకు మాదిరిగానే దీనికి కూడా జనసమీకరణ చేస్తారేమోనని సెటైర్లు విసురుతున్నారు. ఇదే విషయంపై మరోపక్క రాజకీయ పార్టీలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. ‘70లక్షల మందితో స్వాగతం పలికేందుకు ట్రంప్‌ ఏమైనా దేవుడా?’ అని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. ట్రంప్‌ పర్యటనకు చేస్తున్న ఏర్పాట్లపై మరింత కఠినంగా స్పందించిన శివసేన..ఇది బానిస మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని విమర్శించింది. 

ఏదీఏమైనా అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి మోతేరా స్టేడియం వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు స్వాగత కార్యక్రమంలో పాల్గొనేలా ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తోంది. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.