
తాజా వార్తలు
‘గ్రీన్’ చూపిస్తే..‘నో’ క్వారంటైన్
ఆన్లైన్ చర్చలో స్పష్టం చేసిన హర్దీప్ సింగ్ పూరి
దిల్లీ: ఆరోగ్య సేతు యాప్‌లో ‘గ్రీన్’ స్టేటస్ చూపిస్తే క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. మే 25 నుంచి దేశీయ విమాన ప్రయాణాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ఆన్లైన్ ద్వారా నెటిజన్ల అనుమానాలను నివృత్తి చేశారు. గురువారం కూడా క్వారంటైన్ గురించి ఆయన ఇదే విషయం చెప్పిన సంగతి తెలిసిందే.
‘ఆరోగ్య సేతు యాప్‌లో గ్రీన్ స్టేటస్ చూపించాక కూడా ప్రయాణికులను క్వారంటైన్లో ఉంచాల్సిన అవసరం ఏంటో అర్థం కావడం లేదు’ అని హర్దీప్ సింగ్ అన్నారు. అలాగే ఆగష్టు, సెప్టెంబరు కంటే ముందే చెప్పుకోదగ్గ సంఖ్యలోనే విదేశీ విమాన ప్రయాణాలు ప్రారంభమవుతాయని ఆశిస్తున్నామన్నారు. అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. దేశీయ ప్రయాణాల నేపథ్యంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రం ప్రయాణికులను క్వారంటైన్ ఉంచాలంటూ పట్టుబడుతున్నాయి. దానిపై ఆన్లైన్ చర్చలో కొందరు ఆందోళన వ్యక్తం చేయగా..క్వారంటైన్ కానీ, ఐసోలేషన్ కానీ అవసరం లేదన్నారు.
క్వారంటైన్‌పై రాష్ట్రాలు పట్టుబట్టడంపై గతంలో కూడా మంత్రి స్పందించారు. ‘క్వారంటైన్ గురించి ఎందుకు అనవసర చర్చ పెడుతున్నారో తెలియడం లేదు. ఇది దేశీయ విమానయానం. బస్సు, రైల్లో ప్రయాణించినట్లే ఇది కూడా. అసలు కరోనా పాజిటివ్ ఉన్నవాళ్లు విమాన ప్రయాణం చేయడానికి అనుమతించం’ అని తెలిపారు. ఒకవైపు కరోనా కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నా.. శ్రామిక రైళ్లు, ప్రత్యేక రైళ్లతో పాటు, మే 25 నుంచి దేశీయ విమానాలు, జూన్ ఒకటి నుంచి 200 ప్యాసింజర్ రైళ్లను నడపడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఇవీ చదవండి:
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
- మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు
- మధుమేహులూ.. మరింత జాగ్రత్త!
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- మొదటి వరసలో ఆ ఇద్దరూ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
