close

తాజా వార్తలు

మా ప్రశ్నలపై భాజపా స్పందిస్తేనే..: రౌత్‌

దిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లును తీసుకొచ్చిన ఎన్డీయే ప్రభుత్వం మతపరమైన అంశాలతో దేశప్రజలను విడదీసేందుకు యత్నిస్తోందని శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ భాజపాపై విరుచుకుపడ్డారు. పొరుగుదేశాల నుంచి వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వాన్ని కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. కొంతమంది ప్రతిపక్ష పార్టీలు పాకిస్థాన్ మాదిరిగానే మాట్లాడుతున్నాయని భాజపా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రౌత్‌ ఖండించారు. ప్రధాని వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘భారతదేశానికి స్వీయభాష ఉంది. ఈ దేశంలోని దేశభక్తులు ఇతర దేశాల పాఠశాలలకు వెళ్లాల్సిన అవసరం లేదు’ అని సంజయ్ రౌత్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘లోక్‌సభలో జరిగిన దానితో పోల్చితే రాజ్యసభలో కాస్త విరుద్ధంగా జరిగేందుకు అవకాశాలున్నాయి. అయితే దీనిపై ప్రస్తుతం ఏం చెప్పలేం. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం కోసం శివసేన మద్దతు కోరుకున్నట్లయితే లోక్‌సభలో శివసేన అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఓటుబ్యాంకు రాజకీయాలు చేయడం సరికాదు. ఇది సరైన సమయం కూడా కాదు. ఈ బిల్లుతో హిందువులు, ముస్లింలను విడదీసే ప్రయత్నం చేయడం మంచిది కాదు’ అని రౌత్‌ తెలిపారు. లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిన శివసేన తన మిత్రపక్షాలైన కాంగ్రెస్‌, ఎన్సీపీ నుంచి కాస్త వ్యతిరేకత రావడంతో రాజ్యసభలో ఈ బిల్ల ఆమోదానికి మద్దతు ఇవ్వాలా? వద్దా? అనేదానిపై పునరాలోనలో పడింది. శ్రీలంక నుంచి వచ్చిన తమిళ శరణార్థులకు సైతం ఈ బిల్లు వర్తించేలా సవరణలు చేయాలని లోక్‌సభలో శివసేన చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరి తెలిపే వరకు రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదానికి సహకరించేది లేదని శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నిన్న స్పష్టం చేశారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.