డిసెంబరు రెండోవారంలో టీకాకు అనుమతి!

తాజా వార్తలు

Updated : 20/11/2020 16:09 IST

డిసెంబరు రెండోవారంలో టీకాకు అనుమతి!

బ్రస్సెల్స్‌: రెండు కొవిడ్‌-19 వ్యాక్సిన్ల వినియోగానికి డిసెంబరు రెండో వారంలో షరతులతో కూడిన అనుమతి లభించే అవకాశం మెండుగా ఉందని ఐరోపా సమాఖ్య (ఈయూ)కు చెందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ మేరకు జరుగుతున్న ప్రక్రియ తుది దశకు చేరుకుందని పేర్కొన్నారు. 

ఈయూ నేతలతో గురువారం యురోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు యుర్సులా వాన్‌ డెర్‌ లెయెన్‌ కీలక సమావేశం నిర్వహించారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి, పంపిణీ, కొనుగోలు ఒప్పందాలపై లోతుగా చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మోడెర్నా, ఫైజర్‌ అభివృద్ధి చేస్తున్న టీకాలు ఈ సంవత్సరాంతానికి ప్రజా వినియోగానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించిన అనుమతుల్ని ‘యురోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ’ (ఈఎంఏ) త్వరలోనే మంజూరు చేయనుందని వెల్లడించారు. ఈ మేరకు ఈఎంఏ, ఔషధ నియంత్రణ సంస్థల మధ్య నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. 

ఐరోపా కమిషన్‌ ఇప్పటికే పలు ఔషధ తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. బయోఎన్‌టెక్‌, ఫైజర్‌ నుంచి మిలియన్ల డోసుల కొనుగోలు ఒప్పందం ఖరారైంది. మోడెర్నాతోనూ ఈ వారంలో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. వీటిని ఈయూ సభ్యదేశాల్లో పంపిణీ చేయనున్నారు.

ఇవీ చదవండి..

జనవరిలోనే ఇటలీ ప్రజలకు టీకా

రూ.500-600కే ప్రజలకు ఆక్స్‌ఫర్డ్‌ టీకాAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని