ఆరోగ్యంపై దీర్ఘకాలం కరోనా ప్రభావం!
close

తాజా వార్తలు

Published : 09/10/2020 12:18 IST

ఆరోగ్యంపై దీర్ఘకాలం కరోనా ప్రభావం!

స్వల్ప లక్షణాలైనా నెలల పాటు తప్పని అనారోగ్య తిప్పలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సోకి స్వల్ప స్థాయిలో అనారోగ్యానికి గురైనప్పటికీ లక్షణాలు మాత్రం నెలల తరబడి ఉంటున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. మరికొంత మందిలో రోజులు గడుస్తున్న కొద్దీ అనారోగ్యం మరింత తీవ్రమవుతోందని తెలిపింది. ఈ మేరకు ఫ్రాన్స్‌లో మార్చి నుంచి జూన్‌ మధ్యలో జరిపిన ఓ అధ్యయనాన్ని ‘క్లినికల్‌ మైక్రోబయాలజీ అండ్‌ ఇన్ఫెక్షన్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది

స్వల్ప నుంచి మోస్తరు స్థాయి లక్షణాలున్న 150 మంది కొవిడ్‌ బాధితులపై ఈ అధ్యయనం జరిపారు. వీరిలో 66.66శాతం మందిలో కరోనా నిర్ధారణ అయిన 60 రోజుల తర్వాత కూడా లక్షణాలు తగ్గలేదు. రుచి, వాసన కోల్పోవడం, శ్వాస సమస్య, అలసట, జ్వరం, జలుబు సహా మరికొన్ని కొవిడ్‌ లక్షణాల్లో ఏదోఒకటి వీరిలో కనిపిస్తున్నట్లు గుర్తించారు. ఇక 33.33శాతం మందిలో తొలినాళ్లతో పోలిస్తే ఆరోగ్యం బాగా క్షీణించింది. ముఖ్యంగా 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారిలో లక్షణాలు దీర్ఘకాలం కొనసాగాయి. కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత కూడా చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారన్న పరిశీలనలకు ఈ అధ్యయనం బలం చేకూరుస్తోంది. కరోనా నెగెటివ్‌గా నిర్ధారణ అయినప్పటికీ.. చాలా మంది శ్వాసకోశ, గుండె సంబంధిత ఇబ్బందులు సహా మరికొన్ని అనారోగ్య సమస్యలకు గురవుతున్నట్లు పలు పరిశీలనల్లో ఇప్పటికే వెల్లడైన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని తేలింది.  

మహమ్మారి పూర్తిగా అంతమైన తర్వాత కూడా ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని ఈ అధ్యయనం గుర్తుచేస్తోందని ఈ పరిశోధనలో పాల్గొన్న ఓ శాస్త్రవేత్త తెలిపారు. దీనిపై మరింత లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని