close

తాజా వార్తలు

Published : 30/11/2020 16:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మాకు పరిష్కారం కావాలి: రైతు సంఘాలు

దిల్లీ:ఎటువంటి షరతులు లేని చర్చలకు తాము అంగీకరిస్తామని భారతీయ కిసాన్ మంచ్ అధ్యక్షుడు బుటా సింగ్ అన్నారు. ఈ తరహా సమావేశానికి కేంద్రం అంగీకరించిట్లు తమకు తెలిసిందన్నారు. ‘మాకు లేఖ వచ్చిన వెంటనే మేం కలుస్తాం. మాకు పరిష్కారం కావాలి’ అని సింగ్ వెల్లడించారు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన తీవ్రమవుతోన్న తరుణంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో చర్చలకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. కాగా, 12 గంటల్లో కేంద్ర మంత్రులు భేటీ కావడం ఇది రెండో సారి. 

ఇదిలా ఉండగా, నిరసనలో పాల్గొంటున్న రైతులను ఇదివరకే కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. అయితే, సరిహద్దులో ఉండకుండా దిల్లీ శివారులోని బురాడిలో ఉన్న మైదానానికి వెళ్లి ఆందోళన కొనసాగిస్తే వెంటనే చర్చలు జరుపుతామని అమిత్‌ షా సూచించారు. చర్చలు జరిపేందుకు షరతులు పెట్టడం అవమానకరమని రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బురాడికి వెళ్లేది లేదని, సరిహద్దులోనే చర్చలు జరగాలని తేల్చిచెప్పారు. లేకపోతే దిల్లీకి చేరుకునే ఐదు రహదారులను దిగ్బంధిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర మంత్రులు అత్యవసరంగా భేటీ అయ్యారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని