
తాజా వార్తలు
రైతులు చట్టాల్ని అర్థం చేసుకోలేదు: నీతిఆయోగ్
దిల్లీ: ఆందోళన చేస్తున్న రైతులు నూతన వ్యవసాయ చట్టాల్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేదని నీతి ఆయోగ్ సభ్యుడు(వ్యవసాయం) రమేశ్ చంద్ అభిప్రాయపడ్డారు. అన్నదాతల ఆదాయాల్ని భారీ ఎత్తున పెంచడానికి కొత్త చట్టాలు దోహదం చేస్తాయని తెలిపారు. తప్పనిసరి వినియోగ వస్తువుల చట్టాన్ని(ఎసెన్షియల్ కమొడిటీస్ యాక్ట్-ఈసీఏ) పూర్తిగా తొలగించి.. దళారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు రైతులు భావిస్తున్నారన్నారు. కానీ, వాస్తవానికి ఆ చట్టంలో కేవలం కొన్ని మార్పులు మాత్రమే చేశారన్నారు. నూనె గింజలు, పప్పు దినుసులు, చిరు ధాన్యాల ధరలు 50 శాతం కంటే పెరిగితే ఈ చట్టం అమల్లోకి వచ్చేలా మార్పులు తీసుకొచ్చారని వివరించారు. బంగాళాదుంప, ఉల్లి ధరలు 100 శాతం పెరిగితే ఈసీఏ అమల్లోకి వస్తుందన్నారు.
కాంట్రాక్ట్ ఫార్మింగ్ విషయంలోనూ రైతుల్లో అనేక అపోహలు నెలకొన్నాయని రమేశ్ చంద్ తెలిపారు. ఈ తరహా సాగుని కార్పొరేట్ వ్యవసాయంతో పోల్చుకొని పొరబడుతున్నారన్నారు. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే కాంట్రాక్ట్ సాగు విధానం అమల్లో ఉందని వెల్లడించారు. కానీ, ఎక్కడా రైతుల భూముల్ని ప్రైవేటు కంపెనీలు లాక్కొన్న సందర్భాలు లేవని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రంగ వృద్ధి రేటు 3.5 శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేశారు.
ఉల్లి ఎగుమతులపై తరచూ నిషేధం విధించడంపై రమేశ్ చంద్ వివరణ ఇచ్చారు. ధరలు పెరిగినప్పుడు వినియోగదారుల ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని నిషేధం తప్పదని తెలిపారు. కొన్ని సార్లు వినియోగదారుల ప్రయోజనాల్నీ కాపాడాల్సిన అవసరం ఉంటుందన్నారు. అన్ని సందర్భాల్లో నిషేధం విధించడం లేదని.. ఉత్పత్తి లేని సమయంలోనూ ధరలు పెరిగితే ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకుంటోందన్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత మూడు రోజులుగా రైతులు దిల్లీలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
