
తాజా వార్తలు
దిల్లీ శివారుల్లోకి అన్నదాతలు
అర్ధరాత్రీ ఆగని నిరసన ర్యాలీలు
వివిధ మార్గాల్లో దేశ రాజధాని సమీపంలోకి చేరుకున్న రైతులు
దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ‘చలో దిల్లీ’ నిరసన ర్యాలీ శుక్రవారమూ కొనసాగుతోంది. హరియాణా, పంజాబ్ నుంచి వచ్చే రహదారుల్లో భారీ స్థాయిలో బలగాల్ని మోహరించినప్పటికీ.. అన్నదాతలు దిల్లీ శివారుల్లోకి చేరుకున్నారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన భారీ బారికేడ్లను సైతం తొలగించుకుంటూ ముందుకు నడిచారు. హరియాణాలోని పానిపట్ వద్ద అర్ధరాత్రి పోలీసులు ప్రయోగించిన బాష్పవాయువు, జల ఫిరంగులను సైతం లెక్క చేయలేదు.
రైతుల ఆవేశాన్ని దృష్టిలో ఉంచుకొని దిల్లీ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దేశ రాజధానిలోకి ప్రవేశించే సింఘూ ప్రాంతంలో ఎక్కికక్కడ ఇసుక లారీలను రోడ్డుకు అడ్డంగా నిలిపారు. ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. పరిస్థితి చేయి దాటకుండా ముందు జాగ్రత్తగా జల ఫిరంగులను మోహరించారు. ఫరీదాబాదద్, గురుగ్రామ్ ప్రాంతాల్లోనూ దిల్లీ పోలీసులు భారీ స్థాయిలో గస్తీ కాస్తున్నారు. అయినప్పటికీ నగరంలోకి ప్రవేశించకుండా వెనుదిరిగేది లేదని ఇప్పటికే సింగూ, టిక్రీ చేరుకున్న రెండు బృందాల రైతులు స్పష్టం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకునే వరకు నిరసన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.
సింగూకు చేరే క్రమంలో అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లు, ముళ్ల కంచెల్ని దాటుకొని వచ్చామని రైతులు తెలిపారు. దిల్లీకి 100 కి.మీ దూరంలో ఉన్న హరియాణాలోని పానిపట్ ప్రాంతంలో ఇంకా అనేక మంది ఉన్నారని పేర్కొన్నారు. మరో బృందం వివిధ మార్గాల్లో సోనిపట్-దిల్లీ శివారుకి చేరుకుందని చెప్పారు. రాత్రి పానిపట్‌లో బస చేసిన భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) చీఫ్ నేతృత్వంలోని మరో బృందం దిల్లీవైపు తరలివస్తోందని తెలిపారు. హరియాణాలోని రోహ్తక్ జిల్లా నుంచి మరికొంత మంది రైతులు దిల్లీ శివారులోని టిక్రీ ప్రాంతానికి చేరుకున్నారని పేర్కొన్నారు. పంజాబ్-హరియాణా సరిహద్దుల్లో ఉన్న డబ్వాలీ ప్రాంతానికి చేరుకున్న ఉన్న మరో బృందం పోలీసులు సృష్టిస్తున్న అన్ని అడ్డంకుల్ని దాటుకొని దిల్లీ చేరుకుంటామని చెప్పింది.
మరోవైపు రైతు సంఘాలను నగరంలోకి అనుమతించేది లేదని దిల్లీ పోలీసులు తేల్చి చెప్పారు. నగరంలో కొవిడ్ విజృంభణ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి టిక్రీ రహదారిపై వాహనాల రాకపోకల్ని నిషేధించారు. దిల్లీ-గురుగ్రామ్ రహదారిలో భారీ స్థాయిలో తనిఖీలు చేస్తుండడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దేశ రాజధానిలోని ఆరు మెట్రో స్టేషన్లను మూసివేశారు.
సింఘు ప్రాంతం వద్దకు చేరుకున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు శుక్రవారం ఉదయం మరోసారి బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పరిస్థితి చేయి దాటితే అరెస్టు చేసేందుకు నగరంలోని తొమ్మిది మైదానాలను జైళ్లుగా ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆప్ సర్కార్‌ను దిల్లీ పోలీసులు కోరారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- నాన్‌స్టాప్ ‘ఫన్’షూట్.. లంగాఓణి ‘ఉప్పెన’ రాణి
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- టీకా పంపిణీలో భారత్ ప్రపంచ రికార్డ్!
- మరో 6 పరుగులు చేసుంటే..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
