close

తాజా వార్తలు

Published : 08/08/2020 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొత్త మందుతో వేగంగా రికవరీ!

వెంటిలేటర్లపై ఉన్న కరోనా బాధితుల్లో ఉపశమనం

హ్యూస్టన్‌: కరోనా చికిత్సలో సానుకూల పరిణామం! శ్వాసవ్యవస్థ విఫలమై తీవ్రస్థాయి ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్న బాధితులు త్వరగా కోలుకోవడానికి కొత్త ఔషధమొకటి బాగా ఉపకరిస్తున్నట్టు వైద్య నిపుణులు గుర్తించారు. దీని పేరు ‘ఆర్‌ఎల్‌ఎఫ్‌-100’. ఈ ఔషధం ప్రస్తుతం అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ఆధ్వర్యంలో రెండో దశ ప్రయోగ పరీక్షలు పూర్తిచేసుకుంటోంది.

దీన్ని మొదటగా హ్యూస్టన్‌ మెథడిస్ట్‌ ఆసుపత్రిలో వెంటిలేటర్లపై ఉన్న రోగులకు అందించగా... సగటున మూడు రోజులకే వారి ఆరోగ్య పరిస్థితి మెరుగైనట్టు వైద్యులు గుర్తించారు. న్యూరోఆర్‌ఎక్స్‌ అనే స్వతంత్ర పరిశోధన సంస్థ దీన్ని తయారు చేసింది. ‘‘అవిప్టాడిల్‌ అనేది ఊపిరితిత్తుల్లో అధిక సాంద్రతతో ఉండి, అంతర్గత వాపులకు కారణమయ్యే సైటోకీన్లను నియంత్రిస్తుంది. అక్కడ కరోనా వైరస్‌ పెరగకుండా ఊపిరితిత్తుల కణాలతో కలిసి సమర్థంగా అడ్డుకుంటుంది. వెంటిలేటర్లపై ఉన్న చాలామందిలో న్యుమోనియా ఉనికిని త్వరగా పోగట్టడమే కాకుండా, బ్లడ్‌-ఆక్సిజన్‌ స్థాయిని కూడా ఇది మెరుగుపరిచింది. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.