తొలిసారి అక్కడ కరోనా కేసులు ‘సున్నా’!

తాజా వార్తలు

Published : 26/12/2020 08:24 IST

తొలిసారి అక్కడ కరోనా కేసులు ‘సున్నా’!

ముంబయి: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ తగ్గుముఖం పడుతోంది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారవిలో గడిచిన 24 గంటల్లో ఒక్క కేసూ నమోదు కాకపోవడం విశేషం. దేశంలోకి కొవిడ్‌ ప్రవేశించిన తర్వాత ముంబయిలోని ఈ ప్రాంతంలో కొత్త కేసులు నమోదు కాకపోవడం ఇదే ప్రథమం. ధారవిలో తొలి కేసు ఏప్రిల్‌ 1న నమోదైంది. అత్యధిక జనసాంధ్రత కలిగిన ధారవిలో ఇప్పటివరకు 3,788 మంది కొవిడ్ బారిన పడినట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. ధారవిలో ప్రస్తుతం 12 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. వీరిలో ఎనిమిది మంది హోం ఐసోలేషన్‌లో ఉండగా.. నలుగురు కొవిడ్‌ కేర్‌ కేంద్రంలో చికిత్స పొందుతున్నట్టు అధికారులు వెల్లడించారు.

జులై 26న ధారవిలో కేవలం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి. నెలల తర్వాత మళ్లీ పెరిగాయి. తాజాగా ఒక్క కేసూ నమోదు కాలేదు. కరోనా వ్యాప్తి కట్టడిలో ధారవి ఆదర్శంగా నిలిచింది. ఇక్కడి కట్టడి తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ప్రశంసించింది. ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రాకింగ్‌, ట్రీట్‌మెంట్‌ పద్ధతిని అనుసరించి ప్రజల భాగస్వామ్యంతో కరోనాను కట్టడి చేయగలిగినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, ముంబయి నగరంలో 596 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,89,800కి చేరింది. తాజాగా మరో 377 మంది కోలుకోగా.. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు ముంబయిలో 2,69,672 మంది కోలుకోగా.. 11,056 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 8,218 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఇదీ చదవండి..

అక్కడ ప్రతి 85మందిలో ఒకరికి వైరస్!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని