మరి కొంతకాలం బ్రిటన్‌కు విమానాల రద్దు

తాజా వార్తలు

Updated : 29/12/2020 16:26 IST

మరి కొంతకాలం బ్రిటన్‌కు విమానాల రద్దు

సూచనప్రాయంగా తెలిపిన కేంద్రమంత్రి

దిల్లీ: కరోనా వైరస్‌ కొత్తరకం ఆందోళనల నేపథ్యంలో భారత్-బ్రిటన్‌ మధ్య విమానాల రాకపోకలు మరి కొంతకాలం నిలిచిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హరదీప్‌సింగ్‌ పురి సూచనాప్రాయంగా వెల్లడించారు. ‘బ్రిటన్‌కు విమాన సర్వీసులపై తాత్కాలిక రద్దు ఇంకొంతకాలం ఉండొచ్చని అనుకుంటున్నా. అయితే ఈ పొడగింపు సుదీర్ఘకాలం లేదా నిరవధికంగా ఉండకపోవచ్చు’ అని కేంద్రమంత్రి అన్నారు. భారత్‌లో కొత్త రకం కరోనా కేసులు వెలుగు చూడటం, యూకేలో వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

జన్యుమార్పిడి చెందిన కరోనా వైరస్‌ బ్రిటన్‌లో విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రపంచ దేశాలు యూకేకు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. భారత ప్రభుత్వం కూడా ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి డిసెంబరు 31 వరకు బ్రిటన్‌కు విమానాల రాకపోకలను రద్దు చేసింది. అయితే డిసెంబరు 23 లోగా దేశానికి చేరుకున్న వారికి ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇందులో పలువురు ప్రయాణికులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వీరికి సోకింది కొత్త వైరసా? కాదా అని తెలుసుకునేందుకు ప్రయాణికుల రక్తనమూనాలను వైరాలజీ ల్యాబ్‌లను పంపించారు. కాగా.. ఈ పరీక్షల్లో ఇప్పటివరకు ఆరుగురికి కొత్త రకం వైరస్‌ నిర్ధారణ అయినట్లు కేంద్ర హోంశాఖ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. 

కాగా.. నవంబరు 25 నుంచి డిసెంబరు 23 వరకు యూకే నుంచి దాదాపు 33వేల మంది ప్రయాణికులు వివిధ విమానాశ్రయాల గుండా భారత్‌ చేరుకున్నారు. వీరందరినీ ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తించి వీరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు యూకే నుంచి వచ్చిన వారిలో 114 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. 

ఇవీ చదవండి..

భారత్‌లోకి కరోనా కొత్తరకం 

కొత్తరకంపై ఆందోళన వద్దు: సీసీఎంబీ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని