close

తాజా వార్తలు

Published : 30/10/2020 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫ్రాన్స్‌లో రెండోసారి లాక్‌డౌన్‌

ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు మెక్రాన్‌

పారిస్‌: రెండో దఫా కరోనా విజృంభణతో వణికిపోతున్న ఫ్రాన్స్‌ మరోసారి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించింది. కొవిడ్ బాధితులతో ఆసుపత్రులన్నీ నిండిపోతుండటంతో..ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ బుధవారం ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ సరికొత్త లాక్‌డౌన్‌తో వైరస్‌ను అదుపులోకి తీసుకురాగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబరు 1వ తేదీ వరకు ఇది కొనసాగే అవకాశం ఉంది. 

‘చివరకు నిరాశావాదులు కూడా ఊహించనంత వేగంగా ఈ వైరస్ ఫ్రాన్స్‌ అంతటా వ్యాప్తి చెందుతోంది’ అని ఆ దేశ ప్రజలనుద్దేశించి మెక్రాన్‌ మాట్లాడారు. రెండో దఫా కరోనా ఉద్ధృతిని కట్టడి చేసేందుకు రెండు వారాల క్రితం పారిస్‌తో సహా ఇతర ప్రధాన నగరాల్లో విధించిన కర్ఫ్యూ విఫలమైందని ఈ సందర్భంగా ఆయన అంగీకరించారు. ‘ఐరోపాలో విజృంభిస్తోన్న రెండో దఫా వైరస్‌ మొదటిసారి కంటే మరింత ఘోరంగా ఉండొచ్చు. ఇప్పుడు మనం కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే రానున్న నెలల్లో 4లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉంది. మనం ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ నవంబర్‌ మధ్య నాటికి సుమారు 9వేల మంది ఐసీయూలో చేరనున్నారు’ అని ఆయన హెచ్చరించారు.

కాగా, ఆ నిబంధనల ప్రకారం గురువారం రాత్రి  నుంచి అక్కడ బార్లు, రెస్టారెంట్లు, అత్యవసరం కాని వ్యాపారాలు మూసివేయాల్సి ఉంది. అలాగే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే రాతపూర్వక అనుమతులు తీసుకోవడం తప్పనిసరి చేశారు. ‘సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండండి. నిబంధనలను గౌరవించండి’ అంటూ ఆయన ప్రజలను అభ్యర్థించారు. గతంలో విధించిన లాక్‌డౌన్ మాదిరిగా కాకుండా ఈసారి పాఠశాలలు నడవనున్నాయి. ఇదిలా ఉండగా..ఆ దేశంలో 12,35,132 మంది వైరస్‌ బారిన పడగా, 35 వేలకు పైగా మరణాలు సంభవించాయి.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.