‘భవిష్యత్తు యుద్ధాలు మరింత సంక్లిష్టం’

తాజా వార్తలు

Published : 07/11/2020 15:21 IST

‘భవిష్యత్తు యుద్ధాలు మరింత సంక్లిష్టం’

వాయుసేనాధిపతి భదౌరియా

పుణె: భవిష్యత్తులో యుద్ధభూమి మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉందని భారత వాయుసేనాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌.కె.సింగ్‌ భదౌరియా తెలిపారు. ఊహించని రీతిలో భద్రతాపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. వివిధ కోణాల్లో ఎదురయ్యే ఎలాంటి రక్షణపరమైన సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సైనిక దళాలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పుణెలో జరిగిన ఎన్‌డీఏ క్యాడెట్ల పాసింగ్ ఔట్‌ పరేడ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

త్రిదళాధిపతి(సీడీఎస్‌) వ్యవస్థ ఏర్పాటు, ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మిలిటరీ అఫైర్స్‌’(డీఎంఏ)ను స్థాపించడం భారత సైనిక చరిత్రలో గొప్ప సంస్కరణలుగా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకునే భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావం మన సరిహద్దుల్లోనూ ఉండే అవకాశం ఉంటుందని నూతన క్యాడెట్లకు వివరించారు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ ధైర్యంగా సవాళ్లను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని