జాదవ్‌ కేసు: ‘భారత్‌కు మరో అవకాశం ఇవ్వండి’

తాజా వార్తలు

Published : 04/09/2020 01:30 IST

జాదవ్‌ కేసు: ‘భారత్‌కు మరో అవకాశం ఇవ్వండి’

ఇస్లామాబాద్‌: పాక్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ తరఫున న్యాయవాదిని నియమించుకునేందుకు భారత్‌కు మరో అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్‌ హైకోర్టు పాకిస్థాన్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాకిస్థాన్‌ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసేందుకు జాదవ్‌ తరఫున న్యాయవాదిని నియమించే పిటిషన్‌ను ఇస్లామాబాద్‌ హైకోర్టు గురువారం విచారించింది. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాల మేరకు పాకిస్థాన్‌.. భారత్‌కు కాన్సులర్‌ యాక్సెస్‌ను జారీ చేసిందని ఆ దేశ అటార్నీ జనరల్‌ ఖలీద్‌ జావేద్‌ ఖాన్‌ కోర్టుకు తెలిపారు. జాదవ్‌ తరఫున న్యాయవాదిని నియమించాలన్న పాకిస్థాన్‌ ప్రతిపాదనకు భారత్‌ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో వాదనలు విన్న ఇస్లామాబాద్‌ హైకోర్టు తమ ఉత్తర్వులను భారత్‌కు పంపాలని పాక్‌ ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 3కు వాయిదా వేసింది. గూఢచర్యం ఆరోపణలతో కుల్‌భూషణ్‌కు పాక్‌ మిలటరీ హైకోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని