కొవిడ్‌ ప్రపంచం: 6కోట్లకు చేరిన కేసులు!

తాజా వార్తలు

Published : 25/11/2020 18:50 IST

కొవిడ్‌ ప్రపంచం: 6కోట్లకు చేరిన కేసులు!

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. నిత్యం కొత్తగా దాదాపు 5లక్షల కేసులు బయటపడుతున్నాయి. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 6 కోట్లకు చేరింది. వరల్డోమీటర్‌ ప్రకారం, బుధవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా వీరిలో 14లక్షల 17వేల మంది మృత్యువాతపడ్డారు. కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 4కోట్ల 30లక్షల మంది కోలుకున్నారు. మరో కోటి 70లక్షల క్రియాశీల కేసులున్నాయి.

కరోనా వైరస్‌ ప్రభావం అత్యధికంగా అమెరికాలోనే ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ కోటి 25లక్షలకు పైగా కేసులు నమోదుకాగా మరణించిన వారిసంఖ్య 2లక్షల 60వేలకు చేరింది. రెండో స్థానంలో ఉన్న భారత్‌లో కేసుల సంఖ్య 92లక్షలు దాటగా వీరిలో లక్షా 34వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో పాటు దక్షిణ అమెరికా, యూరప్‌ దేశాల్లో వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా బ్రెజిల్‌, మెక్సికో, యూకే, ఇటలీ, ఫ్రాన్స్‌ దేశాల్లో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉంది. రెండో దఫా విజృంభణతో యూరప్‌లోని కొన్ని దేశాలు మరోసారి లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలు చేస్తున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కొన్ని దేశాలు(జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ ప్రకారం).. 

దేశం    కేసులు         మరణాలు
అమెరికా   1,25,97,506    2,59,976
భారత్‌     92,22,216      1,34,699
బ్రెజిల్‌     61,18,708      1,70,115
ఫ్రాన్స్‌     22,06,126      50,324
యూకే    15,42,623      55,935
ఇటలీ     14,55,022      51,306
మెక్సికో   10,60,152      1,02,739    


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని