close

తాజా వార్తలు

గూగుల్‌ జాబితా.. అభినందన్‌@1

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏ సందేహం వచ్చినా మనకు ముందుగా గుర్తొచ్చేది గూగులే. ఓ విషయం గురించి తెలుసుకోవాలన్నా.. ఓ వ్యక్తి గురించి ఆరా తీయాలన్నా.. ఇతర ఏ విషయమైనా మనకు అదే ఆధారం. ఇలా మనం వెతికిన వాటి గురించి ఏటా కొన్ని జాబితాలను ఆ కంపెనీ ప్రకటిస్తుంటుంది. ఈ సారి కూడా పలు అంశాలతో కూడిన వివిధ రకాల జాబితాలను విడుదల చేసింది. అలాంటి జాబితాల్లో ఒకటి ‘మోస్ట్‌ ట్రెండింగ్‌ పర్సనాలిటీ’. మరో 20 రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ఈ జాబితాను గూగుల్‌ ప్రకటించింది. ఇందులో ఐఏఎఫ్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ మొదటి స్థానంలో నిలిచారు. మరి ఈ జాబితాలో ఉన్న ఇతరులు ఎవరంటే..?

#1 అభినందన్‌ వర్థమాన్‌
శత్రు సైనికుల చెరలో ఉన్నా.. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారు ఐఏఎఫ్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌. శత్రుదేశం చేతుల్లోకి చిక్కినప్పటికీ తలవంచకుండా గుండె నిబ్బరంతో నిలిచారు. ఆయన ధైర్యసాహసాలు మెచ్చి కేంద్ర ప్రభుత్వం వీర్‌చక్రతో సత్కరించింది. దేశభక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆయన 2019లో గూగుల్‌లో మోస్ట్‌ ట్రెండింగ్‌ పర్సనాలిటీ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.

#2 లతామంగేష్కర్‌
ప్రఖ్యాత గాయని లతామంగేష్కర్‌ ఆనారోగ్యంతో ముంబయిలోని బ్రీచ్‌కాండీ ఆసుపత్రిలో చేరారు. 28 రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం ఆమె తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. తన క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ ఆమె మనసారా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు.

#3 యువరాజ్‌ సింగ్‌
క్రికెట్‌ అభిమానుల రారాజు.. భారత క్రికెట్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ గూగుల్‌ మోస్ట్‌ ట్రెండింగ్‌ పర్సనాలిటీ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.

#4 ఆనంద్‌ కుమార్‌
బిహార్‌కు చెందిన ప్రముఖ గణితవేత్త, సూపర్‌ 30 వ్యవస్థాపకుడు ఆనంద్‌ కుమార్‌ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. ఆయన జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన సూపర్‌ 30 సినిమాలో హృతిక్‌ రోషన్‌ ఆనంద్‌ కుమార్‌ పాత్రలో నటించి మెప్పించాడు. ఆనంద్‌ కుమార్‌ తన జీవితంలో పడిన కష్టాలు, సాధించిన విజయాలను ఈ చిత్రంలో చూపించారు.

#5 విక్కీ కౌశల్‌
పాకిస్థాన్‌ సైన్యంపై ప్రతీకార చర్యలో భాగంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌’లో విక్కీ కౌశల్‌ నటించారు. ఈ సినిమాతో మంచి హిట్ అందుకోవడంతో కౌశల్ గురించి ఎక్కువ వెతికారట. దీంతో యువ నటుడు ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు.

#6 రిషబ్‌ పంత్‌
ఈ 22 ఏళ్ల భారత యువ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ మోస్ట్‌ ట్రెండింగ్‌ పర్సనాలిటీలో ఆరో స్థానంలో నిలిచాడు.

#7 రాను మొండల్‌
పశ్చిమ్‌ బంగాలోని ఓ రైల్వే స్టేషన్‌లో సరదాగా పాటలు పాడుతూ ఉన్న రాను మొండల్‌ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ కావడంతో ఆమె సెబ్రిటీగా మారిపోయింది. అంతేకాదు గూగుల్‌ సెర్చ్‌లో వెతికిన వ్యక్తిగానూ ఏడో స్థానంలో నిలిచారు.

#8 తారా సుతారియా
బాలీవుడ్‌లో ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2’ తో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు తారా సుతారియా. మోస్ట్‌ సెర్చ్‌డ్‌ పర్సనాలిటీ జాబితాలో తారా ఎనిమిదో స్థానం దక్కించుకుంది. 

#9 సిద్ధార్థ్‌ శుక్లా
బుల్లితెర నటుడైన సిద్ధార్థ్‌ శుక్లా ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం సిద్ధార్థ్‌ బిగ్‌బాస్‌ సీజన్‌- 13లో ఉన్నాడు.

#10 కొయినా మిత్ర
నటి కొయినా మిత్ర కూడా బిగ్‌బాస్‌ సీజన్‌- 13లో పాల్గొంటున్నారు. నెటిజన్లు వెతికిన మోస్ట్‌ ట్రెండింగ్ పర్సనాలిటీ జాబితాలో మిత్ర పదో స్థానంలో ఉంది.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.