close

తాజా వార్తలు

హఫీజ్‌పై పాక్‌ కోర్టులో అభియోగాలు నమోదు

లాహోర్‌: ముంబయి దాడుల సూత్రధారి, నిషేధిత జమాతుద్‌ దవా అధినేత హఫీజ్‌ సయీద్‌పై ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చినట్లుగా పాకిస్థాన్‌ ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం బుధవారం అభియోగాలు నమోదుచేసింది. సయీద్‌ను న్యాయస్థానం ముందు నిలబెట్టాలన్న అంతర్జాతీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లాహోర్‌లోని ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం (ఏటీసీ) హఫీజ్, అతని ముగ్గురు ప్రధాన అనుచరులు హఫీజ్‌ అబ్దుల్‌ సలామ్‌ బిన్‌ మహమ్మద్, మహమ్మద్‌ అష్రాఫ్, జాఫర్‌ ఇక్బాల్‌లపై అభియోగాలు నమోదు చేసింది. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.