రికార్డుస్థాయిలో రికవరీ రేటు: కేంద్ర ఆరోగ్యశాఖ

తాజా వార్తలు

Updated : 13/09/2020 13:35 IST

రికార్డుస్థాయిలో రికవరీ రేటు: కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: సమర్థవంతమైన ట్రాకింగ్‌, మెరుగైన వైద్య సదుపాయాలతో దేశంలో కరోనా రికవరీ రేటు గణనీయంగా పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రికవరీ రేటు 77.88గా నమోదైనట్లు మంత్రిత్వశాఖ ఆదివారం పేర్కొంది. ‘మే నెలలో మహమ్మారి నుంచి కోలుకున్న వారు 50 వేల మంది ఉండగా సెప్టెంబర్‌లో ఆ సంఖ్య 36 లక్షలకు చేరింది. ప్రతి రోజు 70 వేల మంది వ్యాధి నుంచి కోలుకుంటున్నారు. యాక్టివ్‌ కేసుల కంటే రికవరీ రేటు 3.8 రెట్లు అధికంగా ఉంది’ అని శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. వ్యాధిని ముందే గుర్తించడం, వారికి సరైన వైద్య సదుపాయం అందించడం, నిరంతర పర్యవేక్షణ వల్లే రికవరీ రేటు సాధ్యమైనట్లు పేర్కొంది. 

మరణాల శాతం తగ్గుముఖం పట్టి ప్రస్తుతం 1.65 శాతంగా ఉన్నట్లు ఆదివారం వెల్లడించింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ ఐదు రాష్ట్రాల్లోనే 60 శాతానికి పైగా రికవరీ రేటు నమోదైనట్లు తెలిపింది. శనివారం అత్యధికంగా 81,533 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. ఆదివారం మరో 78 వేల మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని