Heat waves: 50 ఏళ్లు.. 17,362 ప్రాణాలు

తాజా వార్తలు

Published : 05/07/2021 13:02 IST

Heat waves: 50 ఏళ్లు.. 17,362 ప్రాణాలు

 ఇదీ మన దేశంలో వడగాలులకు బలైనవారి సంఖ్య 

 ఎక్కువ మరణాలు ఏపీ, తెలంగాణ, ఒడిశాలోనే 

దిల్లీ: వడగాలుల తీవ్రతకు దేశంలో అర్ధ శతాబ్ద కాలంలో ఏకంగా 17 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 1971 నుంచి 2019 మధ్య దేశంలో 706 వడగాలుల ఘటనలు చోటు చేసుకున్నాయి. కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం.రాజీవన్, వాతావరణ శాస్త్రవేత్తలు- కమల్‌జిత్‌ రే, ఎస్‌.ఎస్‌.రే, ఆర్‌.కె.గిరి, ఎం.పి.దిమ్రి కలిసి ఇటీవల ఈ మేరకు పరిశోధన పత్రాన్ని సమర్పించారు. అత్యంత తీవ్ర వాతావరణ ఘటనలు (ఈడబ్ల్యూఈ) కారణంగా దాదాపు యాభై ఏళ్లలో 1,41,308 మంది చనిపోగా వారిలో 17,362 మంది కేవలం వడగాలుల వల్ల మరణించారు. ఇలాంటి వారిలో ఎక్కువమంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలకు చెందినవారే. పంజాబ్, దిల్లీ, హరియాణా, రాజస్థాన్, యూపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ వంటి మరికొన్ని రాష్ట్రాల్లోనూ వేడిగాలుల తీవ్రత ఎక్కువగా నమోదవుతోంది. వడగాలులు ఎక్కువగా మే నెలలో సంభవిస్తుంటాయి. ఇటీవలి కాలంలో ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో అత్యంత వేడిమి గాలులు వీస్తున్న నేపథ్యంలో ఈ అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది. పిడుగుపాటు ఘటనల వల్ల కూడా ప్రాణనష్టం ఎక్కువగానే ఉంటోందని అధ్యయనంలో తేలింది. 2017లో ఏపీలో ఒకసారి, తెలంగాణలో 17 సార్లు వడగాలులు వీచాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని