ఏనుగుల మరణాలు అక్కడే ఎక్కువ..!
close

తాజా వార్తలు

Published : 14/12/2020 08:50 IST

ఏనుగుల మరణాలు అక్కడే ఎక్కువ..!

కొలంబో: ప్రపంచంలోనే అత్యధికంగా ఏనుగులు మరణిస్తోన్న దేశాల జాబితాలో శ్రీలంక ముందుండటం కలవరపెడుతోంది. ఇక్కడ గజరాజులు-మానవుల మధ్య ఏర్పడుతోన్న సంఘర్షణ వల్ల రికార్డు సంఖ్యలో ఏనుగులతో పాటు ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారత్‌ తర్వాత శ్రీలంకలోనే అధిక సంఖ్యలో ఏనుగుల వల్ల ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో అప్రమత్తమైన శ్రీలంక ప్రభుత్వం, ఏనుగుల నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించింది.

ఏనుగులు-మానవుల మధ్య చోటుచేసుకుంటున్న సంఘర్షణ వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారిసంఖ్యలో భారత్‌ ప్రపంచంలోనే తొలిస్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో శ్రీలంక ఉన్నట్లు అక్కడి జాతీయ ప్రజాపద్దుల కమిటీ నివేదించింది. గత సంవత్సరం వివిధ కారణాల వల్ల శ్రీలంకలో 272 ఏనుగులు ప్రాణాలు కోల్పోగా.. గడిచిన 12నెలల్లో ఈ సంఖ్య 407కు పెరిగినట్లు శ్రీలంక ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ టిస్సా విటరనా పేర్కొన్నారు. ఇక ఏనుగుల దాడుల్లో మృతిచెందుతోన్న వారిసంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందని వెల్లడించారు. ప్రతిసంవత్సరం సరాసరి 85మంది మరణిస్తుండగా, ప్రస్తుతం అది 122కు పెరిగిందని తెలిపారు. ఇలా ఏనుగుల-మానవుల మధ్య జరుగుతోన్న సంఘర్షణకు తాజా నివేదికలు పరిస్థితికి అద్దం పడుతున్నాయని..వీటిని సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాల్సిన అవసరాన్ని టిస్సా విటరనా చెప్పారు. గడిచిన 60ఏళ్లుగా ఈ ఘర్షణ వాతావరణం కొనసాగుతున్నప్పటికీ వీటిని తగ్గించడంలో ఇప్పటివరకు ఆశించిన పురోగతి సాధించలేదని అభిప్రాయపడ్డారు.

భారత్‌లోనూ ఏనుగులు-మానవుల మధ్య ఏర్పడుతున్న ఘర్షణ వాతావరణంతో ఇరువైపుల భారీ స్థాయిలో ప్రాణనష్టం సంభవిస్తోంది. ఇలాంటి వాతావరణం వల్ల గడిచిన ఐదేళ్లలో 2300మంది ప్రాణాలు కోల్పోగా..500లకు పైగా ఏనుగులు మృత్యువాతపడ్డట్లు అడవులు, పర్యావరణ మంత్రిత్వ గత కొంతకాలం క్రితం వెల్లడించింది. ముఖ్యంగా విద్యుదాఘాతంతోనే ఎక్కువ ఏనుగులు మరణిస్తుండగా, రైలు ప్రమాదాలు, వేట వంటి మానవ క్రూరచర్యల కారణంగా ఏనుగులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇక ఏనుగులు, పులుల దాడుల్లో అత్యధికంగా మరణిస్తున్న వారిసంఖ్య పశ్చిమబెంగాల్‌లో అధికంగా ఉండగా.. ఒడిశా, మహారాష్ట్రలలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇవీ చదవండి..
గాల్లోంచి ఊడిపడి..యుద్ధాన్ని గెలిపించారు..!
హబుల్‌ 30వ జన్మదినం..నాసా ట్వీట్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని