జమాత్‌కు వెళ్లిన విదేశీయుల వీసాలు రద్దు
close

తాజా వార్తలు

Updated : 02/04/2020 20:13 IST

జమాత్‌కు వెళ్లిన విదేశీయుల వీసాలు రద్దు

కేంద్ర హోంశాఖ నిర్ణయం

దిల్లీ: నిబంధనలు ఉల్లంఘించి దిల్లీలోని తబ్లీగీ జమాత్‌ కార్యక్రమంలో పాల్గొన్న 960 మంది విదేశీయుల వీసాలను రద్దు చేయడంతో పాటు వారి పాస్‌పోర్టులను బ్లాక్‌లిస్ట్‌లో పెడుతూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. ఆ విదేశీయులపై చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల డీజీపీలను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కార్యాలయం ట్వీట్‌ చేసింది.

పర్యాటక వీసాలపై వచ్చిన పలువురు విదేశీయులు నిబంధనలకు విరుద్ధంగా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు హోంశాఖ మంత్రి కార్యాలయం ట్వీట్‌లో వెల్లడించింది. విదేశీయుల చట్టం-1946, విపత్తు నిర్వహణ చట్టం -2005ను వారు ఉల్లంఘించి నిజాముద్దీన్‌లోని తబ్లీగీ జమాత్‌లోని మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నందున..నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని