హాంగ్‌కాంగ్‌: మీడియా టైకూన్‌ అరెస్ట్‌..!

తాజా వార్తలు

Published : 10/08/2020 23:54 IST

హాంగ్‌కాంగ్‌: మీడియా టైకూన్‌ అరెస్ట్‌..!

జాతీయ భద్రత చట్టం కింద అరెస్టు చేసిన అధికారులు
చైనా తీరుపై మండిపడ్డ జర్నలిస్టు సంఘాలు

హాంగ్‌కాంగ్: హాంగ్‌కాంగ్‌లో మీడియా టైకూన్‌ జిమ్మీ లేయ్‌ అరెస్టు అయ్యారు. హాంగ్‌కాంగ్‌లో జాతీయ భద్రతా చట్టం అమలులోకి వచ్చినప్పటి నుంచి దీనికి వ్యతిరేకంగా గళం వినిపిస్తోన్న వారిపై చైనా అణచివేస్తోంది. దీనిలో భాగంగానే మీడియా దిగ్గజం జిమ్మీ లేయ్‌ను కూడా అరెస్టు చేసినట్లు సమాచారం. అయితే, విదేశీశక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నాడనే అభియోగాలపై జిమ్మీపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించారు. అంతేకాకుండా అతను నిర్వహిస్తోన్న మీడియా సంస్థలో మోసాలు జరిగాయనే కారణాలతో పత్రికా కార్యాలయంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ పత్రికకు ఎడిటర్‌ స్థానంలో ఉన్న జిమ్మీని అక్రమంగా అరెస్టు చేశారంటూ అక్కడి జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. హాంగ్‌కాంగ్‌లో మీడియా సంస్థపై పోలీసుల తీరు భయభ్రాంతులకు గురిచేస్తోందని సీనియర్‌ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గత కొంతకాలంగా జాతీయ భద్రతా చట్టానికి వ్యతిరేకంగా హాంగ్‌కాంగ్‌లో జరుగుతున్న నిరసన ప్రదర్శనలను జిమ్మీ సమర్ధిస్తున్నారు. నిరసనకారులపై పోలీసుల దౌర్జన్యాలపై తన పత్రిక యాపిల్‌ డైలీ ద్వారా ప్రశ్నిస్తున్నారు. వీటిని అణచివేసే కుట్రలో భాగంగానే అతన్ని అరెస్టు చేశారని జర్నలిస్టు సంఘాలు చైనా కమ్యూనిస్టు పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని