close

తాజా వార్తలు

Updated : 24/02/2020 10:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఫేస్‌బుక్‌ రారాజులం..త్వరలో కలవబోతున్నాం!

భారత పర్యటనపై మరోసారి ఆసక్తి వ్యక్తపరిచిన ట్రంప్‌

వాషింగ్టన్‌: భారత పర్యటనపై తనకు ఉన్న ఆసక్తిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వ్యక్తపరిచారు. ఈసారి ప్రధాని మోదీకి తనకు మధ్య ఉన్న ఓ కామన్‌ పాయింట్‌ని తెరమీదరకు తెచ్చారు. ఫేస్‌బుక్‌లో ట్రంప్‌ నంబర్‌ వన్‌ అని తర్వాత మోదీ ఉన్నారని ఆ సంస్థ అధినేత జుకర్‌బర్గ్‌ తనతో చెప్పినట్లు ఈ సందర్భంగా ట్రంప్‌ ఉటంకించారు. త్వరలో తాను భారత్‌లో పర్యటించబోతున్నానని, దానికోసం ఆసక్తిగా వేచిచూస్తున్నానని వ్యాఖ్యానించారు. ‘‘ఫేస్‌బుక్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌ నెంబర్‌ వన్‌ అని, తర్వాత ప్రధాని మోదీ ఉన్నారని ఇటీవల జుకర్‌బర్గ్‌  అన్నారు. ఇది గొప్ప గౌరవం అనుకుంటా! నిజానికి, రెండు వారాల్లో నేను భారత్‌కు వెళ్లబోతున్నాను. ఆ పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

భారత్‌లో తొలి పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదుచూస్తున్నానని రెండు రోజుల క్రితమే ట్రంప్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దిల్లీ, అహ్మదాబాద్లో ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్‌ ఆయన సతీమణితో కలిసి పర్యటించనున్నారు. అహ్మదాబాద్‌లో లక్షలాది మంది ప్రజలు తనకు స్వాగతం చెప్పబోతున్నట్లు మోదీ తనతో చెప్పారన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కూడా కుదిరే అవకాశం ఉందన్న ఊహాగానాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.