close

తాజా వార్తలు

బాధ్యతల నుంచి పారిపోను: మోదీ

దిల్లీ: ఇతర దేశాల్లో హింసను ఎదుర్కొంటున్న వారికి భారత పౌరసత్వం కల్పించడం వల్ల మెరుగైన భవిష్యత్తు అందించిన వాళ్లమవుతామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పౌరసత్వ సవరణ బిల్లుని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అనేక మంది భాజపాని ఓడించాలని ప్రయత్నించినా.. తమ ప్రభుత్వం అనుసరించిన ‘సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌’ విధానం వల్లే 2019లో తిరిగి అధికారంలోకి వచ్చిందన్నారు. ‘హిందూస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌’ ప్రారంభోపన్యాసంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు...

* ఏదేశమైనా లేదా ప్రజలైనా పురోభివృద్ధిలో సాగాలంటే సమగ్ర చర్చలు చాలా ముఖ్యం. మెరుగైన భవిష్యత్తుకు చర్చే పునాది. 

* రాజకీయపరంగా అధికరణ 370 రద్దు చాలా కష్టమైన అంశం. కానీ, దాని వల్ల జమ్మూకశ్మీర్‌,  లద్దాఖ్‌ ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు చిగురించాయి. అదే తరహాలో ముమ్మారు తలాఖ్‌ విధానాన్ని రూపుమాపి ముస్లిం ఆడపడచులకు న్యాయం చేశాం. 

* అయోధ్య తీర్పు తర్వాత దేశంలో అల్లర్లు చెలరేగుతాయంటూ కొంతమంది సందేహాలు వ్యక్తం చేశారు. కానీ, ప్రజలు సంయమనం పాటించి అవన్నీ తప్పని నిరూపించారు. 

* దేశ ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. తద్వారా ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరిచేలా ముందుకు సాగుతున్నాం.

* సులభతర వాణిజ్యంలో భారత ర్యాంకింగ్‌ ఎంతో మెరుగుపడింది. బ్యాంకుల విలీనం లాంటి ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాం. బ్యాంకింగ్‌ రంగం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. తప్పకుండా వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకంటాం. నేను నా బాధ్యతల నుంచి పారిపోయే ప్రసక్తే లేదు.   

* మెరుగైన భవిష్యత్తు కోసం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఆ దిశగా ప్రభుత్వం రూ.100లక్షల కోట్లతో చర్యలు తీసుకోబోతోంది. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.