విద్యార్థుల మనోభావాలు వినాలి: సోనియా
close

తాజా వార్తలు

Published : 29/08/2020 01:05 IST

విద్యార్థుల మనోభావాలు వినాలి: సోనియా

జేఈఈ, నీట్‌ నిర్వహణపై ఆందోళన

దిల్లీ: విద్యార్థుల కష్టాలు, వారి మనోభావాలను వినాలని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె ట్విటర్‌లో ఓ వీడియోను పంచుకున్నారు. విద్యార్థుల జీవితాలకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వారి అభిప్రాయాలను సైతం సేకరించాలని పేర్కొన్నారు. జేఈఈ, నీట్‌ ప్రవేశ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘విద్యార్థులారా మీరు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులపై చింతిస్తున్నా. ఈ సమయంలో పరీక్షలు నిర్వహించడం బాధాకరం. మీ తల్లిదండ్రులు సైతం ఆందోళనకు గురవుతున్నారు’ అని సోనియా పేర్కొన్నారు. ‘మీరే మా భవిష్యత్తు. మెరుగైన దేశాన్ని నిర్మిస్తారని మేము మీపై ఆధారపడ్డాం. కాబట్టి మీ భవితవ్యంపై నిర్ణయం తీసుకునే ముందు మీ అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీ కష్టాలు వినాలని కోరుకుంటున్నా. దాని ప్రకారమే నడుచుకోవాలని అభిప్రాయపడుతున్నా’ అంటూ విద్యార్థుల భద్రతపై గళమెత్తుదాం అనే యాష్‌ట్యాగ్‌ను జోడిస్తూ ట్వీట్ చేశారు.

జేఈఈ, నీట్‌ ప్రవేశ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని పలువురు విద్యార్థులు వేసిన పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది. ఇంకో ఏడాదిపాటు వైరస్‌ ఉంటే ఆ ఏడాదిని వృథా చేసుకుంటారా అని ప్రశ్నించింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సకాలంలో పరీక్షలు నిర్వహించాలని తీర్పునిచ్చింది. అయితే మహమ్మారి నియంత్రణలోకి వచ్చే వరకు పరీక్షలను వాయిదా వేసేలా సుప్రీంకోర్టును కోరాలని కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని