శశికళకు ఐటీ శాఖ భారీ షాక్‌!

తాజా వార్తలు

Published : 07/10/2020 17:38 IST

శశికళకు ఐటీ శాఖ భారీ షాక్‌!

రూ.2వేల కోట్ల విలువైన ఆస్తులు అటాచ్‌

చెన్నై: జయలలిత నెచ్చెలి శశికళకు ఐటీశాఖ భారీ షాక్‌ ఇచ్చింది. రూ.2వేల కోట్ల విలువైన ఆమె ఆస్తులను బినామీ నిషేధిత చట్టం ప్రకారం అటాచ్‌ చేస్తున్నట్టు పేర్కొంది. కొడనాడ్‌, సిరతవూర్‌లో శశికళ, ఇళవరసి, సుధాకరణ్‌ పేరిట ఉన్న ఆస్తులను సీజ్‌ చేశారు. ఆయా ప్రాంతాల్లో బయట ఐటీ శాఖ అధికారులు నోటీసులు అంటించారు. ‘‘మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళకు చెందిన ఆస్తులను ఈ రోజు ఐటీ శాఖ అటాచ్‌ చేసింది. తమిళనాడులోని కొడనాడు, సిరతవూర్‌లలోని రూ.2వేల కోట్ల విలువైన ఆస్తులను సీజ్‌ చేసింది’’ అని నోటీసుల్లో పేర్కొంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళతో పాటు ఇళవరసి, సుధాకరన్‌ కూడా జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని