కొండచరియల ఘటన.. 43కు చేరిన మృతులు

తాజా వార్తలు

Published : 10/08/2020 01:02 IST

కొండచరియల ఘటన.. 43కు చేరిన మృతులు

తిరువనంతపురం: కేరళలోని ఇడుక్కి జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో సహాయక సిబ్బంది మరో 17 మంది మృతదేహాలను వెలికితీశారు. దీంతో మృతుల సంఖ్య 43కి చేరింది. ఇప్పటివరకు 12 మందిని కాపాడినట్లు అధికారులు పేర్కొన్నారు. మరో 30 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం భారీ వర్షాలు కురవడంతో రాజమలాయ్‌ ప్రాంతంలోని 30 నివాసాలున్న తేయాకు తోటల కార్మికుల కాలనీలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటికే 26 మృతదేహాలు బయటపడగా, ఆదివారం మరో 17 శవాలను సహాయక సిబ్బంది వెలికి తీశారు. మిగతావారి కోసం స్నైపర్‌ శునకాలతో గాలిస్తున్నారు. మంత్రి వి.మురళీధరన్‌, ప్రతిపక్ష నేత రమేష్‌ చెన్నితల ఆదివారం ప్రమాద స్థలాన్ని సందర్శించారు.

మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ కేరళలోని పలు జిల్లాలను హెచ్చరించింది. అలప్పళ, ఇడుక్కి, మలప్పురం, కోలికోడ్‌, వయనాడ్‌, కన్నూర్‌, కాసర్‌గోడ్‌ ప్రాంతాల్లో రెడ్‌ అలెర్ట్‌ విధించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌‌కు చెందిన ఆరు బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని