కరోనా వారియర్స్‌కు నా సెల్యూట్‌: శివరాజ్‌సింగ్‌

తాజా వార్తలు

Published : 27/07/2020 01:34 IST

కరోనా వారియర్స్‌కు నా సెల్యూట్‌: శివరాజ్‌సింగ్‌

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచన

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కరోనా వారియర్స్‌ కృషిని కొనియాడారు. శనివారం కరోనా పాజిటివ్‌గా తేలిన అనంతరం చౌహాన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేను క్షేమంగానే ఉన్నానంటూ ఆదివారం ఉదయం ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ కృషిని ప్రశంసించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శనివారం నుంచి పలు ట్వీట్లలో సూచిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించాలని, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు. 

‘మిత్రులారా నేను క్షేమంగానే ఉన్నాను. తమ ప్రాణాలను పణంగా పెడుతూ నిస్వార్థంగా పనిచేస్తున్న కరోనా వారియర్స్‌ అంకితభావం వెలకట్టలేనిది. రాష్ట్రంలోని కరోనా వారియర్స్‌ అందరికి నా సెల్యూట్‌’ అని భోపాల్‌లోని చిరాయు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చౌహాన్‌ శనివారం ఓ ట్వీట్‌ చేశారు. ‘అందరూ జాగ్రత్తలు వహించండి. రెండు మీటర్ల దూరం పాటించండి. చేతులను తరచూ శుభ్రం చేసుకోండి. మాస్కులు ధరించండి. కరోనా వైరస్‌ను నివారించే అతి పెద్ద ఆయుధాలు ఇవి. ఈ ఆయుధాలను వినియోగించుకుంటూ, మీరు ప్రేమించేవారిని కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించండి’ అని పేర్కొన్నారు. 

శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తనకు పాజిటివ్‌గా తేలినట్లు శనివారం ఉదయం వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పలు ట్వీట్లు చేస్తున్నారు. ఈరోజు ఉదయం మరో ట్వీట్‌ చేశారు. సంక్రమణ ముప్పు ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని, లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలివాలని కోరారు. ‘కరోనా సోకితే భయపడాల్సిన అవసరం లేదు. ఉన్న లక్షణాలను వైద్యులకు తెలపండి. తద్వారా అందించే వైద్యం మిమ్మల్ని ఆరోగ్యవంతులను చేస్తుంది’ అని అన్నారు. మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు 27 వేల కేసులు నమోదవగా ప్రస్తుతం 7600 యాక్టివ్‌ కేసులున్నాయి. 799 మంది మృతిచెందారు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని