నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను: శివరాజ్‌సింగ్‌

తాజా వార్తలు

Published : 25/07/2020 19:07 IST

నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను: శివరాజ్‌సింగ్‌

మహమ్మారిపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన

భోపాల్‌: కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయిన తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ట్విటర్‌లో వెల్లడించిన చౌహాన్‌ ప్రస్తుతం భోపాల్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ‘కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిన తర్వాత ఆసుపత్రిలో చేరాల్సిందిగా వైద్యులు సూచించారు. ప్రస్తుతం చిరాయు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను. కావాల్సిన అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆసుపత్రి నుంచే విధులు నిర్వహిస్తానని, ప్రజలు మహమ్మారిపై అప్రమత్తంగా ఉండాలని మరో మరో ట్వీట్‌లో తెలిపారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.

తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయిందని శివరాజ్‌సింగ్‌ వెల్లడించిన అనంతరం పార్టీలకు అతీతంగా ఆయన క్షేమాన్ని కోరుతూ పలువురు నేతలు ట్వీట్లు చేశారు. మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నామని అన్నారు. కాగా వైద్యులు సూచించిన అన్ని మార్గదర్శకాలను పాటిస్తున్నట్లు 61 ఏళ్ల చౌహాన్‌ తెలిపారు.కాగా ఆసుపత్రి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించనున్నట్లుయ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని