close

తాజా వార్తలు

Updated : 16/09/2020 15:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

1 నుంచి 50 లక్షల కేసులకు ఎన్నిరోజులంటే..?

గడిచిన 11రోజుల్లోనే పది లక్షల కరోనా కేసులు

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నిత్యం 90వేల పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. దీంతో సెప్టెంబర్‌ 16నాటికి కరోనా కేసుల సంఖ్య 50లక్షలకు చేరింది. ప్రస్తుతం దేశంలో 9లక్షల 95వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. సెప్టెంబర్‌ ఐదో తేదీన పాజిటివ్‌ కేసుల సంఖ్య 40లక్షలు దాటగా అనంతరం 11రోజుల్లోనే 10లక్షల కేసులు నమోదయ్యాయి. భారత్‌లో తొలి కరోనా కేసు నుంచి మొత్తం లక్ష కేసుల మార్కును చేరడానికి 110రోజులు పట్టింది. అదే 100వ కేసు నుంచి  కేవలం 64 రోజుల్లోనే లక్షకు చేరిందంటే దీని వ్యాప్తి వేగం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో పాజిటివ్‌ కేసులు బయటపడుతోన్న తీరు ఇలా..

పాజిటివ్‌ కేసుల సంఖ్య పట్టిన సమయం..రోజుల్లో..
1 నుంచి లక్ష కేసులు 110 రోజులు
లక్ష నుంచి 10లక్షలు 59
10 నుంచి 20 లక్షలు 21
20 నుంచి 30 లక్షలు 16
30 నుంచి 40 లక్షలు 13
40 నుంచి 50 లక్షలు 11

 

దేశంలో కరోనా మరణాలు సంభవిస్తోన్న తీరు..

దేశంలో కొవిడ్‌ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. భారత్‌లో తొలి కరోనా మరణం మార్చి 12న చోటుచేసుకుంది. ఏప్రిల్‌ 4 నాటికి ఆసంఖ్య 99కి చేరింది. కేవలం 24రోజుల్లోనే 100 మరణాలు రికార్డయ్యాయి. 100 నుంచి వెయ్యి మరణాలు 23రోజుల్లో చోటుచేసుకోగా.. మరో 50రోజుల వ్యవధిలో వెయ్యి నుంచి పదివేలకు చేరింది. నాటి నుంచి కరోనా మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం దాదాపు 10రోజుల్లోనే 10వేల మరణాలు సంభవిస్తున్నాయి. దేశంలో కొవిడ్‌-19 మరణాల రేటు 1.63శాతంగా ఉంది. సెప్టెంబర్‌ 15నాటికి దేశంలో కరోనా మరణాలు 80వేలు దాటాయి. తొలిమరణం నుంచి 80వేలకు పట్టిన సమయం ఇలా..

కొవిడ్‌ మరణా సంఖ్య పట్టిన సమయం..రోజుల్లో..
1 నుంచి 100 24 రోజులు
100 నుంచి 1000 23
1000 నుంచి 10 వేలు 50
10-20వేలు 20
20-30వేలు  17
30-40వేలు 13
40-50వేలు 11
50-60వేలు 10
60-70వేలు 10
70-80వేల మరణాలు 09

అయితే దేశవ్యాప్తంగా రోజువారీ కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు భారీ సంఖ్యలో చేపట్టడంతో  కేసులు ఎక్కువగా బయటపడుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశంలో 1736 కొవిడ్‌ నిర్ధారణ కేంద్రాల ద్వారా నిత్యం పదిలక్షలకు పైగా శాంపిళ్లకు కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.