24 గంటల్లో 85,362 కేసులు.. 1,089 మరణాలు

తాజా వార్తలు

Published : 26/09/2020 10:04 IST

24 గంటల్లో 85,362 కేసులు.. 1,089 మరణాలు

దిల్లీ: భారత్‌లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,41,535 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 85,362 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 59,03,933కి చేరింది. వీరిలో 9,60,696 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 48,49,585 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఇక కొత్తగా 1,089 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 93,379కి పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 82.14 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.58 శాతంగా ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని